
బీజేపీ రాజ్యసభ అభ్యర్ధుల జాబితా విడుదలైంది. 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈమెకు కర్ణాటక నుంచి అవకాశం కల్పించారు. సోమవారం ఉదయం మరో 10 లేదా 12 మందితో రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలు వున్నాయని ఢిల్లీ టాక్.
బీజేపీ తొలి జాబితా:
కాగా.. 15 రాష్ట్రాల సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. సభ్యులు జూన్ 21, ఆగస్టు 1వ తేదీ మధ్య వేర్వేరు తేదీల్లో సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో పదకొండు సీట్లు ఖాళీ కానుండగా, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఆరుగురు సభ్యుల చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. ఐదుగురు రాజ్యసభ ఎంపీలు బీహార్‌లో పదవీ విరమణ చేయనుండగా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి నలుగురు సభ్యులు బయటకు రానున్నారు. వీటితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛత్తీస్గఢ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ నుంచి ఇద్దరు చొప్పున, ఉత్తరాఖండ్ నుంచి ఒకరు రిటైర్ అయినప్పుడు సీట్లు ఖాళీ అవుతాయి.