Team India: తొలిసారి బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్.. ఇంతకీ అవి ఏమన్నాయో తెలుసా?

By Mahesh K  |  First Published Nov 19, 2023, 3:44 PM IST

జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ రోజు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా గెలువాలనే అభినందనలను ఈ రెండు పార్టీలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. ‘కమ్ ఆన్ టీం ఇండియా’ అని బీజేపీ పోస్టు చేయగా..అదే ట్వీట్‌ను కాంగ్రెస్ రీపోస్టు చేస్తూ ‘ఇండియా గెలుస్తుంది’ అంటూ కామెంట్ చేసింది.
 


ఈ రోజు అందరి కళ్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉన్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలుచుకున్న ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇదే మ్యాచ్ విషయమై చిరకాల ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకీభవించాయి.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీజేపీ టీమిండియాకు విషెస్ చెప్పింది. మ్యాచ్ ప్రారంభ సమయంలో బీజేపీ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేసింది. ‘కమ్ ఆన్ టీం ఇండియా. మీపై మాకు విశ్వాసం ఉన్నది’ అని బీజేపీ ఎక్స్ హ్యాండిల్ పేర్కొంది. ఇదే ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ రీపోస్ట్ చేసింది. ఓ వ్యాఖ్యను కూడా జోడింది. బీజేపీ చెప్పిన విషయం వాస్తవం అని పేర్కొంది. ‘ఇండియానే గెలుస్తుంది’ అంటూ రీపోస్టు చేసింది.

Latest Videos

మన దేశంలో క్రికెట్, సినిమాలకు విశేష ఆదరణ ఉంటుంది. ప్రజలందరినీ అన్నింటికి అతీతంగా ఇవి రెండూ ఏకం చేస్తుంటాయని చెబుతుంటాయి. దేశ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా మ్యాచ్ విషయంలో ఏకతాటి మీదికి వచ్చాయి. 

Also Read : India vs Australia: అద్భుతమైన అహ్మదాబాద్ లో భారత వైమానిక సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో

ఇదిలా ఉంటే కాంగ్రెస్ రీపోస్టు ఉద్దేశంలో మరో స్వరం కూడా ధ్వనిస్తున్నది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్ని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టుకున్నాయి. ఇండియానే గెలుస్తుంది అనే అర్థం కేవలం క్రికెట్‌కే కాదు.. లోక్ సభలో విపక్ష కూటమి కూడా గెలుస్తుందనే అనే అర్థంలో చేసిందనీ కొందరు చెబుతున్నారు. నిజానికి బీజేపీ ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును ప్రచారంలోకి తెస్తున్నది. ఈ తరుణంలో అనివార్యంగా టీం ఇండియాకు అభినందనలు తెలుపుతూ ఇండియా అనే పేరునే బీజేపీ ఉపయోగించింది. దీన్ని కాంగ్రెస్ వెంటనే క్యాచ్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది.

click me!