కన్నకూతురి ముందే భార్యను హతమార్చాడు

Published : Apr 08, 2019, 10:46 AM IST
కన్నకూతురి ముందే భార్యను హతమార్చాడు

సారాంశం

కన్నకూతురి కళ్లముందే ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. 

కన్నకూతురి కళ్లముందే ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్థల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మోహనా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టంగిలిపొదర్‌ గ్రామానికి చెందిన సుభాష్‌ నాయక్‌ కొన్నాళ్ల క్రితం రున్నీతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

పెళ్లయిన మూడేళ్లకే వారిద్దరి మధ్య వచ్చిన కలహాల కారణంగా రున్నీతాను సుభాష్‌ పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి తన కూతురితో రున్నీతా పిండికిలో ఉన్న తన పుట్టింటిలోనే నివాసముంటోంది. అయితే ఇటీవల తన కూతురును రెసిడెన్సియల్‌ స్కూల్‌లో జాయినింగ్‌ చేయాలనుకున్న రున్నీతా వాటికి సంబంధించిన ధ్రువపత్రాల కోసం తన భర్త సుభాష్‌కు ఫోన్‌ చేసింది. ఈ క్రమంలో స్పందించిన సుభాష్‌ నాయక్‌ ఆ ధ్రువపత్రాలు ఇచ్చేందుకు అంగీకరించాడు.

కూతురు జాయినింగ్‌ నిమిత్తం సుభాష్‌ నాయక్‌ దంపతులు తన కూతురితో శనివారం పిండికి నుంచి ఓ మోటారుసైకిల్‌పై ఆర్‌.ఉదయగిరికి చేరుకున్నాడు. ఆ మార్గమధ్యంలోని బడపద గ్రామం సమీపంలో మోటారుసైకిల్‌ను ఆపి, భార్య రున్నీతా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని రోడ్డు పక్కన ఉన్న ఓ కల్వర్టు కింద దాచిపెట్టి, తిరిగి కూతురుతో పిండికికి బయలుదేరాడు. కాగా.. తల్లి హత్య విషయాన్నిచిన్నారి బయటపెట్టడంతో.. రున్నీతా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సుభాష్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works