Cryptocurrency: ప‌డిపోతున్న క్రిప్టోలు.. బిట్‌కాయిన్ స్వ‌ల్ప క్షీణ‌త‌.. వ‌రుస‌గా ఐదో రోజు ఇదే ప‌రిస్థితి !

By Mahesh RajamoniFirst Published Jan 11, 2022, 6:08 PM IST
Highlights

Cryptocurrency: క్రిప్టో మార్కెట్లు నష్టాల్లోనే  కొన‌సాగుతున్నాయి. దాదాపుగా అన్ని క్రిప్టోల విలువ పడిపోతూనే ఉంది. Bitcoin, Ether, Dogecoin, Shiba Inu సహా అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు నేటికీ తగ్గుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం క్రిప్టో మార్కెట్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. బిట్‌కాయిన్ ధర 0.38% తగ్గింది. ప్రపంచంలోని పురాతన క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం భారత ఎక్స్ఛేంజ్ కాయిన్‌స్విచ్ కుబేర్‌లో $45,884 (సుమారు రూ. 33.9 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. 
 

Cryptocurrency: క్రిప్టో మార్కెట్లు నష్టాల్లోనే  కొన‌సాగుతున్నాయి. దాదాపుగా అన్ని క్రిప్టోల విలువ పడిపోతూనే ఉంది. Bitcoin, Ether, Dogecoin, Shiba Inu సహా అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు నేటికీ తగ్గుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం క్రిప్టో మార్కెట్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. బిట్‌కాయిన్ ధర 0.38% తగ్గింది. ప్రపంచంలోని పురాతన క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం భారత ఎక్స్ఛేంజ్ కాయిన్‌స్విచ్ కుబేర్‌లో $45,884 (సుమారు రూ. 33.9 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. CoinMarketCap, Binance వంటి అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో, బిట్‌కాయిన్ ధర దాదాపు $42,000 (సుమారు రూ. 31.2 లక్షలు) వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇంత‌కు ముందుతో పోలిస్తే.. 0.38 శాతం బిట్‌కాయిన్ ధ‌ర త‌గ్గింది. ప్రపంచవ్యాప్తంగా $45,000 మార్క్ దిగువన బిట్‌కాయిన్ ట్రేడింగ్ జరగడం వ‌రుస‌గా ఇది ఐదో రోజు. దీంతో క్రిప్టో క‌రెన్సీ ల‌పై పెట్టుబ‌డుల పెడుతున్న వారిలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 

బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌, ఈథర్ ల క్రిప్టో ధ‌ర‌లు కూడా ప‌డిపోయాయి. ప్ర‌స్తుత క్రిప్టోకరెన్సీ ధరల ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం నాడు ఈథర్ టోకెన్ ధర  2.39% తగ్గుదలతో $3,388 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇది భార‌త మార్కెట్ విలువ‌లో దాదాపు రూ. 2.5 లక్షలుగా ఉంది. జనవరి 6న, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు  వడ్డీ రేట్లను పెంచడానికి తన గడువును ముందే షెడ్యూల్  చేసిన త‌ర్వాతి నుంచి క్రిప్టో మార్కెట్ క్షీణతను ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి బిట్ కాయిన్, ఈథర్ వరుసగా 9 శాతం, 8.3 శాతం పడిపోయాయి. Tether, USD Coin, Cardano, Ripple, Dogecoin, Shiba Inu వంటి క్రిప్టో క‌రెన్సీలు సైతం క్షీణ‌త‌ను న‌మోదుచేస్తున్నాయి.  ప్ర‌స్తుతం బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. అయితే, వ‌రుస‌గా క్రిప్టో క‌రెన్సీ ధ‌ర‌లు ప‌డిపోతుండ‌టంపై వీటిపై పెట్టుప‌బ‌డులు పెడుతున్న‌వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గత కొన్నేళ్లలోనే బిట్ కాయిన్‌‌కు ఏడాది ప్రారంభంలో ఇది అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. డిజిటల్ టోకెన్స్‌‍లో దాదాపు సగం వాటా బిట్‌కాయిన్‌‍దే. ఇలాంటి క్రిప్టో మహాపతనం నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ మార్కెట్ భారీగా క్షీణించింది. ఇది 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువకు పడిపోయింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 10% తగ్గింది. CoinGecko ప్రకారం, గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1% పైగా క్షీణించి $2.04 ట్రిలియన్‌కి చేరుకుంది. అంచనాల కంటే ముందే యూఎస్ లిక్విడిటీ ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఇటు క్రిప్టో కరెన్సీ పైన, మరోవైపు పసిడి మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపుతోంది.  కాగా, క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని ( Bitcoin, Ether, Dogecoin, Shiba Inu వంటి Cryptocurrency) తయారు చేస్తారు. 

click me!