
న్యూడిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నేత రబీంద్ర నాథ్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ కూచ్ బెహార్‌లోని బిర్యానీ షాపుల్లో బిర్యానీ వంటకాల్లో వేస్తున్న మసాలా పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పురుషుల సెక్స్‌డ్రైవ్‌నే కాదు.. మగతనాన్ని కూడా తగ్గిస్తున్నదని ఆరోపణలు చేశారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా చేసిన రబీంద్ర నాథ్ గోష్ ఈ ఆరోపణలను చాలా మంది చేస్తున్నారని వివరించారు. బిర్యానీలో వేస్తున్న మసాలాలు పురుషుల సెక్స్ డ్రైవ్ తగ్గిస్తున్నాయని చాలా మంది ఆరోపణలు చేసినట్టు తెలిపారు.
‘గత కొన్ని రోజుల స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సెక్సువల్ డ్రైవ్‌ను దెబ్బ తీస్తున్న మసాలాలు ఏవో ఆ బిర్యానీల్లో వేస్తున్నారని వారంతా చెబుతున్నారు’ అని వివరించారు.
Also Read: చికెన్ బిర్యానీ ఆలస్యం అయిందని రెస్టారెంట్ తగలబెట్టాడు.. న్యూయార్క్ లో ఘటన..
ఈ ఏరియాలో బిహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారు బిర్యానీ షాపులను నడుపుతున్నారని ప్రస్తుత కూచ్ బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ తెలిపారు. వీరు లైసెన్సులు లేకుండానే షాపులు నిర్వహిస్తున్నారని వివరించారు. అన్ని రకాల ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతే తాము ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. ఈ షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేదని తెలిపారు. కాబట్టే ఈ షాపులను మూసేస్తున్నట్టు పేర్కొన్నారు.