
బిపిన్ రావత్ గొప్ప దేశభక్తుడని, ఆయన దేశం కోసం ఎంతో శ్రమించారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. బిపిన్ ఎక్కడునన్నా భారత్ అభివృద్ధిని చూస్తూనే ఉంటారని అన్నారు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ ప్రధాని నివాళి అర్పించారు. శనివారం యూపీలోని సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. తొలి సీడీఎస్ సైన్యంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. త్రివిధ దళాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. బిపిన్ ఇక్కడ లేకపోయినప్పటికీ దేశం తీసుకునే సహసోపేతమైన నిర్ణయాలను గమనిస్తూనే ఉంటారని అన్నారు.
పినాక ఈఆర్ రాకెట్ లాంచర్ ప్రయోగం విజయవంతం
అస్థికలు నిమజ్జనం చేసిన కూతుర్లు..
తొలి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌ల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. ఆ దంపతుల అస్థికలను వారి కూతుర్లు కృతిక, తరిణి శనివారం నిమజ్జనం చేశారు. ఉత్తరాఖాండ్‌లోని హరిద్వార్ లోని గంగా నది తీరంలో సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి, అస్థికలను నిమజ్జనం చేశారు. అంతకు ముందు ఉదయం బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వద్ద కు చేరుకున్న కూతుర్లు తల్లిదండ్రుల చితాభస్మాన్ని సేకరించారు. తరువాత ఉత్తరాఖండ్ చేరుకుని వారి సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు.
శిక్షణలో ఉన్న సైనిక అధికారులను ఉద్దేశించి ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్న బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో 12 మంది సైనిక అధికారులతో కలిసి బుధవారం కోయంబత్తూరు నుంచి హెలిక్యాప్టర్ లో బయలుదేరారు. ఎంఐ-17వీ5 రకానికి చెందిన ఆ హెలిక్యాప్టర్ వెల్లింగ్టన్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో బయలుదేరిన ఆరగంటలోపే కున్నూరు సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ఒక్కరూ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్న కెప్టెన్ వరుణ్ సింగ్ ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి దేశం మొత్తం నివాళి అర్పించింది. ఈ ఘటన జరిగిన వెంటనే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొలి సీడీఎస్ ఇలా హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పల్ల దేశం మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
హెలిక్యాప్టర్ మృతుల్లో తెలుగువ్యక్తి లాన్స్ నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన సాయితేజ అత్యంత ప్రతిభాశీలి. అందుకే ఆయనను రావత్ తన సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ లో చేర్చుకున్నారు. వారి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.