మోడీ, బిల్ గేట్స్ చర్చ:ఇండియాలో టెక్నాలజీ పురోగతిపై ప్రశంసలు

By narsimha lodeFirst Published Mar 29, 2024, 9:38 AM IST
Highlights


డిజిటల్ విప్లవంతో పాటు పలు అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్  చర్చించారు. 

న్యూఢిల్లీ: ఇండియాలో  టెక్నాలజీ పురోగతిని  మైక్రోసాఫ్ట్  సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలో  ఇండియా పాత్రను  బిల్ గేట్స్ అభినందించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిల్స్ గేట్స్  శుక్రవారం నాడు పలు అంశాలపై  చర్చలో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారిత  వంటి అంశాలపై  మైక్రోసాఫ్ట్  సహా వ్యవస్థాపకులు  బిల్ గేట్స్ తో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చర్చించారు. ఇందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియోలో పోస్టు చేశారు మోడీ.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించినట్టుగా మోడీ చెప్పారు.అలాగే మైండ్ సెట్ను కూడ మార్చాలని తాను భావించినట్టుగా మోడీ పేర్కొన్నారు. జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వాడుకున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. జీ 20 సదస్సు లక్ష్యాలను  ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చినట్టుగా తాను విశ్వసిస్తున్నానని మోడీ పేర్కొన్నారు.జీ 20 సదస్సును భారత్ అద్భుతంగా నిర్వహించిందని బిల్ గేట్స్  ప్రశంసలు కురిపించారు. 

 

An insightful interaction with . Do watch! https://t.co/wEhi5Ki24t

— Narendra Modi (@narendramodi)

దేశంలో డిజిటల్ విప్లవరం గురించి మోడీ మాట్లాడారు. ఇండోనేషియాలో  జరిగిన  జీ 20 సమ్మిట్ సందర్భంగా  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు  దేశంలో డిజిటల్ విప్లవం గురించి  ఉత్సాహన్ని చూపిన విషయాన్ని ప్రధాని  మోడీ  ప్రస్తావించారు. ఇండియాలో  డిజిటల్ ప్రభుత్వం ఉందని  బిల్ గేట్స్  ప్రశంసలు కురిపించారు.  భారతదేశం సాంకేతికతను స్వీకరించడమే కాదు, వాస్తవానికి కూడ దారి చూపుతుందని  బిల్ గేట్స్  పేర్కొన్నారు.గ్రీన్ జీడీపీని అభివృద్ది చేసుకోవడంలో దృష్టి పెడతామని  మోడీ చెప్పారు.జీవనశైలిలో మార్పులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

చాట్ జీపీటీని ఉపయోగించడం మంచిదే కానీ, ఇది అలసత్వానికి దారి తీయకూడదని మోడీ పేర్కొన్నారు. నమో యాప్ ను ఎలా వినియోగించాలో బిల్ గేట్స్ కు వివరించారు నరేంద్ర మోడీ.నమో యాప్ బిల్ గేట్స్  సెల్ఫీ తీసుకున్నారు.

టెక్నాలజీ అంటే తనకు అత్యంత ఇష్టమని  మోడీ పేర్కొన్నారు.తాను ఎక్కడ ఏ వస్తువును చూసినా, ఏ టెక్నాలజీని చూసినా బహుముఖంగా  దాని వినియోగంపై  తాను ఆలోచించనున్నట్టుగా మోడీ పేర్కొన్నారు. బిల్ గేట్స్ ప్రస్థానాన్ని మోడీ అడిగి తెలుసుకున్నారు.తృణధాన్యాలకు ఎరువులు పెద్దగా అవసరం ఉండదని  మోడీ పేర్కొన్నారు. ఈ పంటలకు తక్కువ నీరు అవసరమౌతుందని కూడ  ఆయన చెప్పారు.
 

click me!