కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
బిహార్ : లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండికూటమి తరపున ప్రచారం చేపడుతున్నారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగానే ఇవాళ బిహార్ లో ప్రచారం చేపడుతున్న ఆయనను పెను ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీతో పాటు చాలామంది నేతలు వుండగానే ఒక్కసారిగా వేదిక కుంగిపోయింది. అయితే ఈ ప్రమాదం నుండి రాహుల్ సురక్షితంగా బయటపడ్డారు.
బిహార్ లోని పాలిగంజ్ లో ఇవాళ ఇండి కూటమి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఆర్జెడి నేతలు తేజస్వి యాదవ్, ఆయన సోదరి మీసా భారతి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే రాహుల్ తో పాటు చాలామంది నాయకులు వేదికపై వుండగానే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా వేదిక కుంగిపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనలో రాహుల్ కు గానీ, ఇతర నాయకులకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు... అందరూ సురక్షితంగా వున్నారు.
undefined
సరిగ్గా రాహుల్ నిలబడిన చోటే వేదిక కుంగిపోయింది. అయితే రాహుల్ అదుపుతప్పి కిందపడిపోకుండా పక్కనేవున్న లాలుప్రసాద్ కూతురు మీసా భారతి, ఇతర నాయకులు పట్టుకున్నారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై రాహుల్ కు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూసుకున్నారు.
The stage couldn't tolerate "Rahul Gandhi Jindabad slogans" and collapsed....💀 pic.twitter.com/W0KV7Kyj6A
— Mr Sinha (Modi's family) (@MrSinha_)తమ నాయకుడు రాహుల్ ప్రమాదవార్త విని కంగారుపడిపోయిన కాంగ్రెస్ శ్రేణులు ఆయన సురక్షితంగానే వున్నట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత రాహుల్ తన ప్రచారాన్ని కొనసాగించారు... తేజస్వి, మీసా భారతితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.