
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదంపై సుప్రీం కోర్టే ఎటు తేల్చలేకపోయింది. ఇలా దేశంలోనే కాకుండా ప్రపంచదేశాల్లో హిజాబ్ గురించి చర్చ జరుగుతోంది. తాజాగా మరోవివాదం తెర మీదికి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం సమస్య ఇంకా చల్లారక ముందే.. తాజాగా బీహార్‌లో హిజాబ్ విషయంలో రచ్చ జరిగింది.
ఆదివారం (అక్టోబర్ 16) బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఎండీడీఎం (MDDM) కళాశాలలో ఇంటర్ సెంటప్ పరీక్షలో హిజాబ్‌ను తొలగించారని ఆరోపిస్తూ బాలికలు నిరసన తెలిపారు.ఈ ఘటనపై విద్యార్థి మాట్లాడుతూ.. "పరీక్ష ఇస్తున్నప్పుడు, ఉపాధ్యాయుడు హిజాబ్‌ను తీసివేసి, బ్లూటూత్ పెట్టుకున్నారా? లేదా చూపించమని అడిగాడు. మేము చెవిని చూపించాము, కానీ వారు హిజాబ్‌ను తీసివేయమని అడిగారు." ఈ విషయమై ఎండీడీఎం కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశామని తెలిపార.
కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చెప్పారు?
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కనుప్రియ మాట్లాడుతూ.. పరీక్షకు ముందు చాలా మంది బాలికలు తమ మొబైల్స్‌ను డిపాజిట్ చేశారని, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా అని చెవి చూసేందుకు హిజాబ్ ధరించిన బాలిక వద్దకు టీచర్ చేరుకోగా.. ఆ బాలిక చెవిని చూపించేందుకు నిరాకరించి ఆగ్రహంతో బయటకు వచ్చిందని.. వెళ్లిపోయిందని తెలిపారు. సమాచారం ప్రకారం.. ఆమె సంఘ విద్రోహశక్తులకు, పోలీసులకు సమాచారం అందించింది, ఆమె తన చెవులు చూపించకుండా మతం ఆధారంగా సమస్యను లేవనెత్తిందని ఆరోపించారు. రూమ్‌లో ఉన్న మరో అమ్మాయి కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందనీ, ఆ అమ్మాయికి టీచర్ మాటలతో ఇబ్బంది ఉంటే.. ఆమె దాని గురించి పరీక్ష కంట్రోలర్‌కి లేదా నాకు ఫిర్యాదు చేసేది, కానీ ఆమె ఎవరికైనా ఏదో చెప్పింది. చెప్పను." 11వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉందని.. పాఠశాల ఆవరణలో మతం, కులం పేరుతో ఆమెను ఎవరో తప్పుదోవ పట్టించారని.. కానీ ఎలాంటి వివక్ష జరగలేదని తెలిపారు.
గత కొన్ని నెలలుగా స్త్రీలు ధరించే హిజాబ్ విషయంలో వివాదంగా వార్తల్లో నిలుస్తూ ఉంది. కర్ణాటకలో ఈ వివాదం రేగింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో మతంతో ముడిన పడిన అంశాలపై రకరకాల నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. ఈ క్రమంలో విద్యాలయాల్లో ముస్లిం యువతులు హిజాబ్ దరించడంపై నిషేధించింది.ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఇస్లాం మతస్తుల నుంచి, ఆ మతంలోని యువతులు-మహిళల నుంచి, రాజకీయ పార్టీలను విభిన్నమైన స్పందన వచ్చింది. హిజాబ్ ధరించకూడదని ప్రభుత్వం ఎలా చెబుతుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు ఈ ముస్లిం విద్యార్థులు. అయితే కర్ణాటక హైకోర్టులో ఈ అంశంపై ఏదో ఒకటి తేలిన తర్వాతే తమ వద్దకు రావాలని తెలింది సుప్రీం కోర్టు. దేశవ్యాప్తంగా రేగడంతో ఈ వివాదంపై రైటా, రాంగా సూటిగా చెప్పలేకపోయింది.