కరోనా దెబ్బ: ఒకే రోజు ఇద్దరు మృతి, ఇండియాలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

By narsimha lode  |  First Published Mar 22, 2020, 12:02 PM IST

బీహార్ రాష్ట్రంలో కరోనా వ్యాధితో  ఓ వ్యక్తి ఆదివారం నాడు మృతి చెందాడు. ఈ వ్యాధి లక్షణాలతో ఇవాళ ఒక్కరోజే  దేశంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకొంది.



పాట్నా: బీహార్ రాష్ట్రంలో కరోనా వ్యాధితో  ఓ వ్యక్తి ఆదివారం నాడు మృతి చెందాడు. ఈ వ్యాధి లక్షణాలతో ఇవాళ ఒక్కరోజే  దేశంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకొంది.

దేశంలో కరోనా వ్యాధి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆదివారం నాటికి దేశంలో 324 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు.

Latest Videos

undefined

Also read:మహారాష్ట్రలో కరోనాతో ఒకరు మృతి, దేశంలో 324 పాజిటివ్ కేసులు

కరోనా వ్యాధి సోకినవారిలో ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 63 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఇక బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఖతార్ నుండి బీహార్ రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించి వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. 

అయితే ఈ వ్యాధి ప్రభావం కారణంగా ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.ఈ వ్యాధితో ఒక్క రోజునే ఇద్దరు మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు మరింత అప్రమత్తమయ్యారు.ఆయా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

click me!