బిహార్‌లో విచిత్ర దొంగతనం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే చెరువును మాయం చేశారు. చెరువు నిండా మట్టితో నింపి ఆ తర్వాత దానిపై ఓ గుడిసెను వేశారు.
Bihar: బిహార్‌లో మరో విచిత్ర రీతిలో దొంగతనం జరిగింది. ఈ రాష్ట్రంలో గతంలో మొత్తం బ్రిడ్జీ, రోడ్డునే ఎత్తుకెళ్లిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపాయి. తాజాగా మరో ఆశ్చర్యకర ఘటన జరిగింది. దర్బంగా జిల్లాలో ఓ చెరువునే రాత్రికి రాత్రి మాయం చేశారు. అప్పటి వరకు అక్కడ కనిపించిన చెరువును మట్టితో నింపేశారు. పొద్దున లేచే సరికి ఆ చెరువుపై ఇల్లు ప్రత్యక్షం అయింది.
దర్బంగ జిల్లాలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ఈ జిల్లాలో ప్రభుత్వ చెరువును కబ్జా చేశారు. అక్కడ మాఫియా చెరువును కబ్జా చేసింది. చెరువులో మట్టితో నింపేశారు. ఆ తర్వాత దానిపై ఓ గుడిసెనే కట్టారు. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులకూ సమాచారం ఇచ్చారు.
undefined
రాత్రిపూట ట్రక్కుల రాకపోకలు జరిగాయి. 10 నుంచి 15 రోజులు వరుసగా రాత్రిపూట ట్రక్కులు రయ్ రయ్ మని పరుగులు పెట్టాయి. అనేక ఇతర యంత్రాల చప్పుళ్లు కూడా వచ్చాయి. కానీ, ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టలేదు.
Also Read: ఇలాంటి స్కామ్ కూడా ఉంటుందా? కడుపు చేసే ఉద్యోగం ఇస్తామని బోల్తా
అక్కడ ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో గ్రామస్తులు చేపలు పట్టేవాళ్లు. మరికొందరు చెట్లను పెంచడానికి నీటిని ఉపయోగించేవారు. కానీ, ఒక రోజు వారు అక్కడికి వెళ్లగానే నమ్మశక్యం కాని దృశ్యాలను చూశారు. అసలు అక్కడ చెరువు నామరూపాలే లేకుండా పోయింది. ఆ చెరువు ఉన్న చోటే మట్టితో చదును చేసి.. దానిపై ఓ గుడిసెను వేశారు.
ఈ పనంతా రాత్రిపూటనే జరిగినట్టు స్థానికులు చెబుతున్నారని డీఎస్పీ కుమార్ తెలిపారు. అయితే.. ఆ భూమి ఎవరిది? ఆ గుడిసె ఎవరిది? అనేది ఇంకా ఎవరికీ తెలియదని వివరించారు. దర్భంగా పోలీసులు ఈ విచిత్ర దొంగతనాన్ని విచారిస్తున్నారు.