Covid Cases: దేశంలో 4,309 యాక్టివ్ కేసులు, కొత్తగా 841.. 227 రోజుల్లో ఇదే అత్యధికం

By Mahesh KFirst Published Dec 31, 2023, 9:40 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కొత్తగా 841 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కు పెరిగింది. 227 రోజుల తర్వాత మళ్లీ అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి.
 

Corona Cases: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా రాత్రి 8 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 841 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 4,309కు పెరిగాయి. 

సుమారు ఏడున్నర నెలల తర్వాత కొత్త కేసులు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి. 227 రోజుల క్రితం అంటే మే 19న గరిష్టంగా 865 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మళ్లీ తాజాగా 841 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి.

కొత్త కేసులతోపాటు ముగ్గురు కరోనా రోగులు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కరి చొప్పున కరోనా పేషెంట్లు మరణించారు.

డిసెంబర్ 5వ తేదీ వరకు కరోనా కేసులు నామమాత్రంగానే రిపోర్ట్ అయ్యాయి. కానీ, కరోనా వైరస్ కొత్త వేరియంట్ వచ్చాక కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 

Also Read: ఇలాంటి స్కామ్ కూడా ఉంటుందా? కడుపు చేసే ఉద్యోగం ఇస్తామని బోల్తా

కరోనా మహమ్మారిగా విలయం సృష్టించినప్పుడు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. 2020లో మన దేశంలోకి ఎంటర్ అయిన ఈ వైరస్ 4.5 కోట్ల మందికి సోకింది. అప్పటి నుంచి 5.3 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు.

click me!