కక్ష సాధింపు కాదు, తప్పు చేస్తే ఎవరైనా...: అర్నబ్ అరెస్ట్ పై సంజయ్ రౌత్

By narsimha lodeFirst Published Nov 4, 2020, 3:06 PM IST
Highlights

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.

ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.

బుధవారం నాడు అర్నబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై రౌత్ స్పందించారు.తప్పు చేసినట్టుగా ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్పారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో పాటు టీఆర్పీ రేటింగ్ స్కాం విషయమై ప్రశ్నించినందుకే  అర్నబ్ ను అరెస్ట్ చేసినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

also read:అర్నబ్ అరెస్ట్: ఖండించిన ఐఎఫ్‌డబ్ల్యుజె

అర్నబ్ ను అరెస్ట్ చేయడాన్ని కేంద్ర సమాచారశాఖ మంత్రి జవదేకర్  చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ  రాష్ట్రంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు.

గోస్వామిని అరెస్ట్ చేయడం ఎమర్జెన్సీని తలపిస్తోందని జవదేకర్ చెప్పారు. పోలీసులు తమ పని తాము చేసుకొంటూపోతున్నారని రౌత్ వివరించారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అర్నబ్ గోస్వామి అరెస్ట్ ను ఖండించారు.

click me!