గంగా నదిలో మృతదేహాల కలకలం: కరోనాతో చనిపోయినవారేనా?

By narsimha lodeFirst Published May 10, 2021, 5:20 PM IST
Highlights

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో  గంగానదిలో మృతదేహలు కలకలం రేపుతున్నాయి. గంగానదిలో కిలోమీటరు పరిధిలో పదుల సంఖ్యలో మృతదేహాలు  నీటిలో తేలియాడుతున్నాయి. 

పాట్నా: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో  గంగానదిలో మృతదేహలు కలకలం రేపుతున్నాయి. గంగానదిలో కిలోమీటరు పరిధిలో పదుల సంఖ్యలో మృతదేహాలు  నీటిలో తేలియాడుతున్నాయి. గంగానదిలో తేలుతున్న డెడ్‌బాడీలపై కలకలం రేపుతున్నాయి. కరోనాతో మరణించిన రోగుల సంఖ్యను తగ్గించి చూపడానికి నదిలో డెడ్‌బాడీలను నదిలో వేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

అయితే  గంగానదిలో కిలోమీటరు పరిధిలో మృతదేహాలు ఎక్కడివనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని యమునా నదిలో కూడ ఇదే రకమైన పరిస్థితి కన్పించింది. రాష్ట్రంలోని హామీర్‌పుర్  జిల్లాలో ఈ తరహ దృశ్యాలు కన్పించాయి.  గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మృతులు పెరుగుతున్న కారణంగా  నదిలో డెడ్‌బాడీలు వేస్తున్నారనే అనుమానాలు కూడ లేకపోలేదు. అంత్యక్రియల నిర్వహణకు భయపడి నదిలో మృతదేహాలను వదిలేస్తున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య  రోజు రోజకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు తగ్గిపోయాయి. 4 లక్షల నుండి 3 లక్షలకే కరోనా కేసులు తగ్గాయి. చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్ లు అమలు చేస్తున్నాయి. 
 

click me!