నీచులు.. శవాల్నీ వదిలిపెట్టడం లేదు.. బట్టలు కొట్టేసి, బ్రాండ్ పేరుతో మోసం... !!

By AN TeluguFirst Published May 10, 2021, 3:16 PM IST
Highlights

ఓ వైపు కరోనా మానవత్వాన్ని కనుమరుగు చేస్తోంటే.. మరోవైపు డబ్బుకోసం నీచానికి పాల్పడుతున్నారు మరికొందరు. చనిపోయాక స్మశానంలో కూడా వారి ఆత్మలకు శాంతి లేకుండా చేస్తున్నారు.

ఓ వైపు కరోనా మానవత్వాన్ని కనుమరుగు చేస్తోంటే.. మరోవైపు డబ్బుకోసం నీచానికి పాల్పడుతున్నారు మరికొందరు. చనిపోయాక స్మశానంలో కూడా వారి ఆత్మలకు శాంతి లేకుండా చేస్తున్నారు. 

మృతదేహాల మీది దుస్లులు దొంగిలించే నీచకార్యానికి దిగజారుతున్నారు. అంతేకాదు వీటికి బ్రాండింగ్ మార్చి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ హేయమైన చర్య ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెడితే లక్నో లో ఓ ముఠా స్మశానాల్లో శవాల మీది దుస్తులు దొంగిలించి వేరే కంపెనీ ట్రేడ్ మార్క్ వేసి అమ్ముుకుంటోంది. ఈ పనికి తెగబడిన కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా స్మశానాల్లో దొంగతనంగా ప్రవేశించి అక్కడున్న దుస్తులు తీసుకొచ్చి, ఓ దుకాణ దారుడికి అప్పగించేవారు.

సదరు దుకాణ దారుడు ఆ వస్త్రాలకు కంపెనీ ట్రేడ్ మార్క్ తగిలిస్తున్నాడు. ఆ తరువాత ఎక్కవ ధరకు వాటిని అమ్మేస్తున్నాడు. ఈ దారుణమైన ఘటన వెలుగుచూడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. 

విషయం బయటపడడంతో దుకాణదారుడితో సహా ఏడుగురు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు బాఘ్ పత్ ప్రాంతంలో గత పదేళ్లుగా ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. 

వీరిని అరెస్ట్ చేసిన వీరివద్దనుంచి 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 140 చొక్కాలు, 34 ధోతీలు, 112 ట్రేడ్ మార్క్ స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. 

దీంతో ఈ దుకాణంలో బట్టలు కొన్నవారంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. తాము నమ్మి బట్టలు కొంటే శవాల మీది బట్టలు అమ్మి మోసం చేశారంటూ వాపోతున్నారు. 
 

click me!