
Gang rape on nurse: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు అమలులోకి తెచ్చిన దారుణాలు ఆగడం లేదు. కామంతో కొట్టుకున్న మానవ మృగాలు వాటిని ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఏ మాత్రం భయం లేకుండా చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా బీహార్‌లోఅత్యంత దారుణ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న నర్సుపై సామూహిక అత్యాచారం చేసి .. అత్యంత దారుణంగా గొంతుకోసి హతమర్చారు. ఈ దారుణ ఘటన సంచలనం రేపుతోంది. నర్సింగ్‌హోమ్‌లోని డాక్టర్, కాంపౌండర్‌లు నర్సుపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మోతీహరిలోని జాంకీ సేవా సదన్ నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్న ఓ నర్సుపై అందులో పనిచేస్తున్న డాక్టర్, కాంపౌండర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు కాంపౌండర్‌ను అరెస్టు చేయగా నిందితుడు డాక్టర్, ఇతర సిబ్బంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో డాక్టర్ జైప్రకాష్ దాస్‌తో పాటు మరో ఐదుగురిపై బాధితురాలి తల్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నర్సింగ్‌హోమ్‌కు పోలీసులు సీల్ వేశారు. 30 ఏళ్ల బాధితురాలు వితంతువు, నాలుగేళ్ల పాప ఉందని పోలీసులు తెలిపారు.
బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ జైప్రకాశ్ దాస్‌తో కలిసి మంతోష్ కుమార్ నర్సింగ్ హోమ్ నిర్వహించేవాడు. భర్త చనిపోయాక తన కూతురు తన దగ్గరే ఉండిపోయిందని తెలిపారు. తమ పరిస్థితిని చూసిన జయప్రకాష్, మంతోష్ కుమార్ నా కుమార్తెను వారి క్లినిక్‌కి పంపాలని, అక్కడ ఆమె కొంత డబ్బు సంపాదించి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చని తనకు నచ్చజెప్పారని బాధితురాలి తల్లి తెలిపారు.
పని కోసం వెతుకుతున్న తన కుతూరు కూడా వారి వద్ద పని చేయడానికి అంగీకరించి నర్సింగ్ హోం కు వెళ్లడానికి అంగీకరించింది. అయితే అక్కడి జరుగుతున్న కార్యకలాపాలు తనకు అనుమానాస్పదంగా ఉన్నాయని, అందులో పనిచేయడానికి తన కుతూరు నిరాకరించింది. తనను కూడా వేధించారని వివరించింది. కానీ, కొన్ని రోజుల తరువాత .. జైప్రకాష్, మంతోష్ కుమార్ తన ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి, తన కుతూరుకి మంచి వేతనాన్ని అందిస్తానని హామీ ఇస్తూ తిరిగి పనిలో చేరాలని కోరారు. దీంతో తన కుతూరుమళ్లీ నర్సింగ్ హోంలో పనికి వెళ్లడం ప్రారంభించింది. కానీ, ఈ నెల 8న పనికి వెళ్లిన తన కుతూరు తిరిగి రాలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయమై డాక్టర్ జయప్రకాష్ ప్రశ్నించగా.. తన కుతూరు ఆరోగ్యం క్షీణించిందని, ఆమె ముజఫర్‌పూర్‌లో ఉందని తెలిపారు. అయితే.. అతను చెప్పిన ఆసుపత్రికి వెళ్లి చూడగా తన కుతూరు కనిపించలేదనీ, ఆ ఆస్పత్రిని విస్తృతంగా శోధన తర్వాత..తన కుమార్తె మృతదేహాన్ని ఓ అంబులెన్స్‌లో గుర్తించామని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తల్లి వాంగ్మూలం ఆధారంగా డాక్టర్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన అనుమానితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులందరినీ త్వరలో అరెస్టు చేస్తామని మోతీహరి ఎస్పీ తెలిపారు.