బిహార్ ఎంపీ డ్రైవర్ చేసిన నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్..!

Published : May 01, 2023, 11:43 AM IST
బిహార్ ఎంపీ డ్రైవర్ చేసిన నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్..!

సారాంశం

కారు బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ చందన్‌సింగ్‌కు చెందినదని, ఆ కారు డ్రైవ్ చేసిన ఎంపీ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.

బిహార్ ఎంపీ చందన్ సింగ్ పర్సనల్ డ్రైవర్ చేసిన నిర్వాకం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తన కారుపై ఓ వ్యక్తిని ఉంచి దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా, ఎంపీ డ్రైవర్ పై అందరూ విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా,  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఆదివారం ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వరకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు ఓ వ్యక్తి వాహనం బానెట్‌కు తగిలించుకుని వెళ్లాడు. కారు బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ చందన్‌సింగ్‌కు చెందినదని, ఆ కారు డ్రైవ్ చేసిన ఎంపీ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.

 తాను ఒక సాధారణ డ్రైవర్ అని, ఓ ప్రయాణికుడిని దింపి తిరిగి వస్తుండగా, తన పట్ల ఎంపీ డ్రైవర్ చేతన్ ఇలా ప్రవర్తించాడని బాధితుడు రాంచంద్ కుమార్ తెలిపాడు. తన కారును రాంచంద్ వచ్చి ఢీ కొట్టాడని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించినందుకు.. తనను కారు బ్యానెట్ పైకి నెట్టుకొని దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించాడని బాధితుడు చెప్పాడు. తాను కారు ఆపమని చాలా సార్లు అడిగానని, అయినా అతను ఆపలేదని బాధితుడు చెప్పడం గమనార్హం.

అయితే, రాంచంద్ వాదన మరోలా ఉంది. తాను ఏ కారును ఢీకొట్టలేదని, అతనే వచ్చి తన కారు ముందుకు వచ్చి నానా బీభత్సం చేశాడని ఎంపీ డ్రైవర్ చెబుతుండటం విశేషం. తాను ఏమీ చేయకపోయినా వచ్చి కారు బ్యానెట్ పై ఎక్కి కారు దిగలదేని, అందుకే తాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లానని చెప్పడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు