మరోసారి సాంకేతిక కారణాలతో అకాసా  ఫ్లైట్ రద్దు.. ప్రయాణికుల ఆందోళన.. 

Published : Oct 19, 2022, 05:58 AM IST
మరోసారి సాంకేతిక కారణాలతో అకాసా  ఫ్లైట్ రద్దు.. ప్రయాణికుల ఆందోళన.. 

సారాంశం

బెంగళూరు నుంచి బయలుదేరిన అకాసా ఎయిర్ విమానంలో మంగళవారం సాంకేతికలు తలెత్తడంతో ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ సర్వీసును రద్దు చేయవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.

అకాసా ఎయిర్ లైన్స్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నుంచి బయలుదేరిన అకాసా ఎయిర్ విమానం క్యాబిన్‌లో కాలిపోయిన వాసన రావడంతో ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంగళవారం అహ్మదాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు చేయబడింది. దీనితో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.

రద్దు చేయడం వల్ల ఎయిర్‌లైన్ చెక్-ఇన్ కౌంటర్‌ల వద్ద ప్రయాణీకులు భయాందోళనలు గురవుతున్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు ఇతర విమానాలు వెళ్లనివ్వాలని కోరుతున్నారు. అకాస ఎయిర్ క్యూపి 1332 రాత్రి 9.55 గంటలకు బయలుదేరాల్సి ఉందని, అయితే రాత్రి 10.55 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు విమానయాన సంస్థ ప్రయాణికులకు తెలియజేశారని, కానీ ఆ తర్వాత రాత్రి 10.30 గంటలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని రద్దు చేసినట్లు ప్రయాణీకులు వాపోతున్నారు.  విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఆహారం లేదా హోటల్ వసతి కల్పించలేదనీ, అలాగే తమ డబ్బులను తిరిగి పొందడానికి విమానాశ్రయంలో వేచి ఉండటానికి రేపటి వరకు సమయం ఇచ్చారని ఆందోళన చెందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu