
నోయిడా : ఈ ఏడాది జనవరిలో కనిపించకుండా పోయిన బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన వ్యక్తి నోయిడాలోని మోమోస్ స్టాల్‌లో కనిపించాడు. నిశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబీకులు భావించారు. అతను జనవరి 31న తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని బావమరిది రవిశంకర్ సింగ్ సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే, నిశాంత్ కుమార్ కుటుంబం సభ్యులు మాత్రం బావమరిదే అతడిని కిడ్నాప్ చేశాడని ఆరోపించింది.
కాగా, చనిపోయాడనుకున్న ఆ వ్యక్తిని నాలుగు నెలల తర్వాత, నోయిడాలోని సెక్టార్ 50లో ఒక మోమోస్ స్టాల్ దగ్గర.. బిచ్చగాడిలా ఉండి.. ఆహారం కోసం అర్థిస్తున్న వ్యక్తిని గమనించాడు. అతడిని బిచ్చగాడు అనుకుని ఆ దుకాణ యజమాని తరుముతున్నాడు. అతడిని రవిశంకర్ సింగ్ వారించి.. అతనికి ఆహారం ఇవ్వాలని బిల్లు తాను చెల్లిస్తానని చెప్పి.. ఇప్పించాడు.
భారత బాలల హక్కుల కార్యకర్త లలిత నటరాజన్‌కు అమెరికా కార్మిక శాఖ అవార్డు
ఆహారం తీసుకున్న తరువాత రవిశంకర్ సింగ్ 'బిచ్చగాడు' గుర్తింపును అడిగాడు. చిరునామా గురించి అడిగాడు. అప్పుడతను తాను బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని నౌగాచియాకు చెందిన వ్యక్తి అని గడ్డం, మీసాలతో ఉన్న వ్యక్తి చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి తన పేరు నిశాంత్ కుమార్ అని, మాజీ బ్యాంక్ ఉద్యోగి సచ్చిదానంద సింగ్ కొడుకు అని కూడా చెప్పాడు.
వెంటనే రవిశంకర్ సింగ్ పోలీసులను పిలిచాడు. వారు వచ్చి అతను చెప్పింది అంతా విన్నారు. బీహార్‌లోని అతని స్నేహితులు, కుటుంబీకులను సంప్రదించారు. ఆ తరువాత ఆ వ్యక్తి తప్పిపోయి నెలలు గడుస్తున్నాయని తెలుసుకున్నారు. తరువాత రవిశంకర్ సింగ్ ఆ వ్యక్తి ఫోటోను కూడా కుటుంబ సభ్యులకు పంపారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణల వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు. కొన్ని నెలల క్రితం అతను కనిపించకుండా పోవడంతో.. అతను చనిపోయాడని అతని మామయ్య పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో తాను అనేక రకాల చిత్రహింసలు ఎదుర్కున్నానని చెప్పాడు.
"ఇప్పుడు కోర్టులో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ కేసులో దోషులు ఎవరైతే.. వారిమీద కోర్టు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది" అని సింగ్ అన్నారు. నిశాంత్ కుమార్ గత సంవత్సరం పల్లవి అనే యువతిని వివాహం చేసుకుని ముంబైకి మకాం మార్చాడని దైనిక్ జాగరణ్ నివేదించింది. గతంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ నగరంలో ఓ ఇంట్లో ఉండేవాడు.
ప్రస్తుతం నిశాంత్ కుమార్ మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా మారాడని పోలీసు అధికారులు పేర్కొన్నారు. స్థానికులతో మాట్లాడగా.. 15 రోజులుగా వ్యక్తి ఇలా తిరగడం చూశామని పోలీసులకు చెప్పారు. నిశాంత్ కుమార్ బీహార్ నుండి నోయిడాకు ఎలా చేరుకున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా భాగల్‌పూర్‌కు తీసుకెళ్లారు.