విచిత్రం.. నాలుగు నెలల కిందట చనిపోయాడని భావించిన వ్యక్తి.. మోమోస్ తింటూ కనిపించాడు..ఎక్కడంటే ?

Published : Jun 14, 2023, 01:58 PM IST
విచిత్రం.. నాలుగు నెలల కిందట చనిపోయాడని భావించిన వ్యక్తి.. మోమోస్ తింటూ కనిపించాడు..ఎక్కడంటే ?

సారాంశం

నాలుగు నెలల కిందట కనిపించకుండా పోయి, చనిపోయాడుకున్న వ్యక్తి  మోమోస్ తింటు కనిపించాడు. వెంటనే అతడిని గుర్తుపట్టి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఓ వ్యక్తి నాలుగు నెలల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతడు కనిపించలేదు. కొన్ని రోజుల పాటు ఎంతో ప్రయత్నించినా అతడి జాడ కనిపించకపోవడంతో అందరూ చనిపోయారని భావించారు. అతడి మరణం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. సీన్ కట్ చేస్తే అతడే నాలుగు నెలల తరువాత ఓ ప్రాంతంలో మోమోస్ తింటూ కనిపించాడు. 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జూలై 6వ తేదీన ఎన్నికలు.. బ్రిజ్ భూషణ్ కు ఛాన్స్ ఉందా ? లేదా ?

సినిమా కథను తలిపించే ఈ వాస్తవ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని భాగల్ పూర్ కు చెందిన నిశాంత్ కుమార్ ఈ ఏడాది జనవరి 31వ తేదీన నుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు. ఉన్నట్టుండి ఆయన ఒక్క సారిగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఎంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో అతడి కోసం తీవ్రంగా వెతికారు. కానీ ఆయన కనిపించలేదు. 

ఈ విషయంలో నిశాంత్ కుమార్ తండ్రి సచ్చిదానంద్ సింగ్ స్థానిక సుల్తాన్ జంగ్ పోలీసు స్టేషన్ లో ను ఆశ్రయించాడు. తన కుమారుడు కనిపించడం లేదని, కుమారుడి బావమరిది రవిశంకర్ సింగ్, అతడి మామ నవీన్ సింగ్ లు కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేశాడు. అయితే రోజులు గడిచినా పోలీసుల నుంచి కూడా సమాచారం రాకపోవడంతో నిశాంత్ మరణించి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ రెండు భూకంపాలు.. కత్రా, దోడాలో కంపించిన భూమి.. ఆందోనళనకు గురైన స్థానికులు 

అయితే ఇటీవల రవి శంకర్ సింగ్ ఢిల్లీ సమీపంలో ఉన్న నోయిడాకు వెళ్లాడు. అక్కడ ఓ రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి మురికి బట్టలు, చేతిలో రొట్టెలతో రెస్టారెంట్ లోకి ప్రవేశించాడు. అతడిని చూసిన ఓ రెస్టారెంట్ ఓనర్ తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు రవి శంకర్ కల్పించుకొని, అతడి తిట్టవద్దని కోరాడు. తను డబ్బులు చెల్లిస్తానని, ఆ వ్యక్తికి తినడానికి మోమోస్ ఇవ్వాలని కోరాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది అతడికి వాటిని అందించారు.

కొంత సమయం తరువాత మోమోస్ తింటున్న వ్యక్తిని రవి శంకర్ చూశాడు. అయితే అది ఎవరో కాదని, నాలుగు నెలల నుంచి కనిపించకుండా పోయిన నిశాంత్ అని గుర్తించాడు. వెంటనే అతడిని స్థానిక పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడి పోలీసులకు వివరాలు తెలియజేసి, అనంతరం బీహార్ పోలీసులకు అప్పగించాడు. అక్కడి పోలీసులు మరుసటి రోజే నిశాంత్ ను కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ  నిశాంత్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అసలు ఢిల్లీకి ఎలా చేరుకున్నాడు అనే విషయం తెలియాల్సింది. ఈ కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు - కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్

కాగా.. తనను, తన కుటుంబాన్ని నిశాంత్ కుటుంబం అనవసరంగా వేధింపులకు గురి చేసిందని రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏం తప్పు చేయకపోయినా మానసికంగా క్షోభ అనుభవించేట్లు చేశారని తెలిపారు. తనకు, తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు రవి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం