మ‌హిళ‌కు వేధింపులు: చితకబాదిన స్థానికులు.. ఆపై శిరోముండనం, బూట్ల దండల‌తో..

Published : Sep 02, 2023, 05:07 AM IST
మ‌హిళ‌కు వేధింపులు: చితకబాదిన స్థానికులు.. ఆపై శిరోముండనం, బూట్ల దండల‌తో..

సారాంశం

Katihar district: మ‌హిళ‌ను వేధింపుల‌కు గురిచేసిన వ్యక్తిని చితకబాది స్థానికులు.. ఆపై శిరోముండనం చేసి బూట్ల దండలు వేశారు. తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించడంతో ఓ వ్యక్తిని కొట్టి, అతని తల, గడ్డాన్ని బలవంతంగా శిరోముండనం చేసి, బూట్లతో దండలు వేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.  

Bihar: మ‌హిళ‌ను వేధింపుల‌కు గురిచేసిన వ్యక్తిని చితకబాది స్థానికులు.. ఆపై శిరోముండనం చేసి బూట్ల దండల‌తో వేశారు. తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించడంతో ఓ వ్యక్తిని కొట్టి, అతని తల, గడ్డాన్ని బలవంతంగా శిరోముండనం చేసి, బూట్లతో దండలు వేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. బిహార్ లోని కతిహార్ జిల్లాలో ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించడంతో అతడిని తీవ్రంగా కొట్టి, అతనికి బలవంతంగా గుండు గీయించి, బూట్ల దండ ధరించేలా చేశారు. కబర్ గ్రామంలో రాజీవ్ కుమార్ అనే వ్యక్తికి చెందిన పిండి మిల్లులో ఆనంద్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ఈ క్ర‌మంలోనే ఆనంద్ తన రెగ్యులర్ గా అక్క‌డికి వెళ్తున్న క్ర‌మంలో రాజీవ్ కుమార్ భార్యతో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఇద్ద‌రు బాగానే నేరుగానూ.. ఫోన్ లోనూ మాట్లాడుకుంటున్నారు.

అయితే గత మూడు నెలలుగా ఆనంద్ తనను వేధిస్తున్నాడని, అవాంఛిత కాల్స్ చేశాడని, తన భర్త లేని సమయంలో ఇంట్లోకి కూడా చొరబడ్డాడని మహిళ ఆరోపించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆనంద్ తనను వేధించాడని ఆమె ఆరోపించింది. ఈ క్ర‌మంలోనే ఆనంద్ ఆక్క‌డ ఉన్న స‌మ‌యంలో ఆమె గ‌ట్టిగా కేకలు వేయడంతో ఆమె కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని ఒక పెద్ద గుంజ‌కు  కట్టేసి చితకబాదారు. అతని తల, గడ్డం కత్తిరించి, అవమానకరంగా చెప్పుల‌ దండలు వేశారు.

చంపేస్తానని ఆనంద్ తన భర్తను బెదిరించాడని కూడా స‌ద‌రు మ‌హిళ ఆరోపించింది. మరోవైపు తాను ఎలాంటి వేధింపుల‌కు పాల్ప‌డ‌లేద‌నీ, ఆ మహిళ తరచూ తనకు ఫోన్ చేసి రమ్మని అడిగేదని ఆనంద్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.  మహిళతో తరచూ ఫోన్ లో మాట్లాడినట్లు అంగీకరించినప్పటికీ, తనకు ఆమెతో ఎలాంటి శారీర‌క సంబంధం లేదని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించి ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరువర్గాలు ఫిర్యాదు చేయకపోవడంతో ఆనంద్ ను పోలీసు కస్టడీ నుంచి విడుదల చేశారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !