బిహార్ ఎన్నిక‌ల్లో స‌రికొత్త రికార్డు.. తొలి ద‌శ‌లో ఓటింగ్‌లో భారీగా పెరిగిన ఓటింగ్

Published : Nov 06, 2025, 06:40 PM IST
Bihar Elections

సారాంశం

Bihar Elections: బిహార్ ఎన్నిక‌ల్లో తొలి ద‌శ ఓటింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. అక్క‌డ‌క్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినా ఈసారి ఎన్నికల్లో బిహార్ ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. 

సాయంత్రం 5 గంటలకే 60.13% పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించారు. నవంబర్ 6న 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా, సాయంత్రం 5 గంటల వరకే 60.13 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గాల్లో 55.81% మాత్రమే ఓట్లు పడటం గ‌మ‌నార్హం.

గత ఎన్నికలతో పోల్చితే పెరిగిన ఓటింగ్ శాతం

2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 58.7% ఓటింగ్ నమోదైంది. 2015లో అయితే 56.9% ఓటర్లు మాత్రమే ఓటేశారు. కానీ ఈసారి మొదటి దశలోనే రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఏ జిల్లాల్లో ఎక్కువగా ఓటేశారు?

ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం..

బేగుసరాయ్ జిల్లాలో అత్యధికంగా 67.32% ఓటింగ్ జరిగింది.

మదెపురాలో 65.74%,

సమస్తీపూర్‌లో 66.65%,

గోపాల్గంజ్‌లో 64.96%,

ముజఫర్‌పూర్‌లో 64.63% ఓట్లు నమోదయ్యాయి.

అదే సమయంలో పట్నాలో 55.02%, భోజ్‌పూర్లో 53.24%, శేఖ్‌పురాలో 52.36% మాత్రమే ఓటింగ్ జరిగింది.

ప్రముఖ అభ్యర్థుల నియోజకవర్గాల్లో పోలింగ్

రాఘోపూర్ (తేజస్వీ యాదవ్) – 64.01%

మహువా (తేజ్ ప్రతాప్ యాదవ్) – 54.88%

తారాపూర్ (సమ్రాట్ చౌధరి) – 58.33%

లఖిసరాయ్ (విజయ్ కుమార్ సిన్హా) – 60.51%

ఛపరా (ఖేసరి లాల్ యాదవ్) – 56.32%

అలీనగర్ (మైతిలి ఠాకూర్) – 58.05%

మోకామా (అనంత్ సింగ్) – 60.16%

అదేవిధంగా సరైరంజన్ (విజయ్ కుమార్ చౌధరి) లో అత్యధికంగా 70.19% ఓటింగ్ జరిగింది.

ప్రజాస్వామ్య స్పూర్తితో ముందుకు వచ్చిన ఓటర్లు

ఈసారి బీహార్ ప్రజలు ఎన్నికల్లో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 18 జిల్లాల్లో శాంతియుతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకే రికార్డు స్థాయి ఓటింగ్ జరగడం, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి నిదర్శనం.

ముఖ్యంశాలు

మొత్తం ఓటింగ్ (సాయంత్రం 5 గంటలకు): 60.13%

గత ఎన్నికల ఓటింగ్: 55.81%

అత్యధిక ఓటింగ్ జిల్లా: బేగుసరాయ్ (67.32%)

అత్యల్ప ఓటింగ్ జిల్లా: శేఖ్‌పురా (52.36%)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్