పటేల్ విగ్రహ సందర్శన.. డిప్యుటీ సీఎంకి చేదు అనుభవం

By ramya neerukondaFirst Published Nov 14, 2018, 4:23 PM IST
Highlights

పటేల్  విగ్రహ సందర్శణకు వెళ్లిన బిహార్ డిప్యుటీ సీఎం సుశీల్ మోదీకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి లిఫ్ట్ లో సుశీల్ మోదీ రెండు సార్లు ఇరుక్కుపోయారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఇటీవల గుజరాత్ లో అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ పటేల్  విగ్రహ సందర్శణకు వెళ్లిన బిహార్ డిప్యుటీ సీఎం సుశీల్ మోదీకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి లిఫ్ట్ లో సుశీల్ మోదీ రెండు సార్లు ఇరుక్కుపోయారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... పటేల్ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తులో నిర్మించారు. కాగా.. ఈ విగ్రహంలో 152మీటర్ల ఎత్తులో పటేల్ ఫోటోలతో ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు  చేశారు. ఈ గ్యాలరీ చూసేందుకు సుశీల్ మోదీ, గుజరాత్ మంత్రి సౌరభ్ పటేల్, ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లిఫ్ట్ ఎక్కారు. అయితే.. లోడ్ ఎక్కువవడంతో లిఫ్ట్ కదలకుండా ఆగిపోయింది.

లిఫ్ట్ డోర్లు మాత్రం మూసుకుపోవడంతో ఊపిరాడక చాలా ఇబ్బందిపడ్డారు. వెంటనే సిబ్బంది స్పందించి రిపేర్ చేశారు. లిఫ్ట్ లో నుంచి కొందరిని బయటకు దింపారు. తర్వాత లిఫ్ట్‌ బయల్దేరింది. అయితే కొంత పైకి వెళ్లాక మరోసారి ఆగిపోయింది. నిమిషం పాటు ఆగిపోయి మళ్లీ బయల్దేరింది. ఇలా సుశీల్‌ మోదీ తదితరులు రెండు సార్లు లిఫ్టులో ఇరుక్కుపోవాల్సి వచ్చింది.

కాగా.. ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించిన నాటి నుంచి అందులోని లిఫ్ట్‌ పనిచేయకపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే లిఫ్ట్‌ పనిచేయలేదు. దీంతో గ్యాలరీకి వెళ్లిన దాదాపు 200 మంది పర్యటకులు మెట్ల దారి ద్వారా కిందకు వచ్చారు.

click me!