ఎమ్మెల్యే ఫోటోకి పూజలు.. కారణం ఏమిటంటే..

Published : Nov 14, 2018, 02:54 PM IST
ఎమ్మెల్యే ఫోటోకి పూజలు.. కారణం ఏమిటంటే..

సారాంశం

ఎమ్మెల్యే ఫోటోని పూజ గదిలో పెట్టి.. ప్రతి రోజూ పూజలు చేస్తున్నారు ఇద్దరు దంపతులు. 


ఎమ్మెల్యే ఫోటోని పూజ గదిలో పెట్టి.. ప్రతి రోజూ పూజలు చేస్తున్నారు ఇద్దరు దంపతులు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వాళ్లు అలా పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం విశేషం.

ఇంతకీ మ్యాటరేంటంటే.. మరణ గౌడ పాటిల్ అనే ఉపాధ్యాయుడు, ఆయన భార్య ప్రభావతి ఇద్దరూ ప్రతిరోజూ గదగ్ జిల్లా రాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కలకప్ప బండి ఫోటోకి పూజలు చేస్తున్నారు. గతంలో  ఈ దంపతులకు ఎమ్మెల్యే సహాయం చేశారంట. అందుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే ఇలా పూజలు చేస్తున్నామని వారు చెప్పడం విశేషం.

అయితే.. వీళ్లు ఇలా పూజలు చేయడాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే.. ఆ ఎమ్మెల్యేకి సన్మానం చేస్తే సరిపోతుంది కానీ.. ఇలా పూజలు చేయడం కరెక్ట్ కాదని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం అది వారి వ్యక్తిగత విషయం అని అంటున్నారు.

వాళ్లు ఎమ్మెల్యే ఫోటోకి పాఠశాలలో, విద్యార్థుల ఎదుట పూజ చేస్తే తప్పు కానీ.. వాళ్ల ఇంట్లో చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌