INDIA Bloc: ప్రతిపక్ష కూటమికి బీటలు? కాంగ్రెస్‌పై విపక్ష పార్టీల ఆగ్రహం

By Mahesh K  |  First Published Nov 2, 2023, 5:24 PM IST

ఇండియా కూటమికి బీటలు పారుతున్నాయా? లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల పంపకాల్లో వచ్చే అనేక అభ్యంతరాలను వేగంగా పరిష్కరించుకోవాల్సింది. లోక్ సభకు ఉమ్మడిగా ప్రతిపక్షాలు సమాయత్తం కావడానికి కార్యచరణను చేపట్టాల్సింది. కానీ, ఐదు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కూటమిని పట్టించుకోవడం లేదు. దీంతో మిత్రపార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తున్నాయి.
 


న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి ఉమ్మడిగా బరిలోకి దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి ఇండియా పేరును ఖరారు చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా అన్ని చూపులు ఈ కూటమిపై పడ్డాయి. ఈ కూటమిలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఏ రాష్ట్రంలో, ఏ స్థానాల్లో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడ అదే పార్టీకి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వాలనే సూత్రప్రాయ ప్రతిపాదనను అంగీకరించాయి. అయితే, సీట్ల పంపకాలపై ఇంకా తేలాల్సి ఉన్నది. ఇంతలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇండియా కూటమిలో పెద్దన్న అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిని సారించింది. దీంతో కూటమి ప్రయత్నాలు కుంటుపడ్డాయి. 

కూటమి పనులపై కాంగ్రెస్ ఇప్పుడు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కూటమిలోని ఇతర పార్టీల విజ్ఞప్తులను ఇప్పుడు సీరియస్‌గా తీసుకోవడం లేదు. అందుకే ఒక్కో పార్టీ ఆ కూటమిని, కూటమి సారథి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాయి. బెంగాల్‌లో ఇప్పటికీ తృణమూల్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. తరుచూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నాయి. కేరళలోనూ అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న వామపక్ష, కాంగ్రెస్ పార్టీల మధ్య పొసగడం లేదు. 

Latest Videos

undefined

కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ నోటిఫికేషన్ విడులవ్వగా అక్కడ సమాజ్ వాదీ పార్టీ అప్రమత్తమై బరిలో దిగడానికి కసరత్తులు మొదలు పెట్టింది .అయితే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. పొత్తు ధర్మంలో భాగంగా తమకు సీట్లను కేటాయిస్తే అందులో పోటీ చేస్తామని సమాజ్ వాదీ పార్టీ విజ్ఞప్తి చేసింది. కానీ, సమాజ్ వాదీ విజ్ఞప్తికి కాంగ్రెస్ నుంచి స్పందన కరువైంది. దీంతో కాంగ్రెస్ పార్టీపై మిత్రపార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ విమర్శలు సంధించింది.

Also Read: బీజేపీ బీసీ నినాదం.. బీసీల సభకు ప్రధాని మోడీ.. ప్రచారంలోనూ ప్రధానాస్త్రం!

తాజాగా, ఈ కూటమి నిర్మాణానికి ప్రముఖంగా కృషి చేసిన బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా ఆరోపణలు చేశారు. కొంత కాలంగా కూటమికి సంబంధించి గొప్ప నిర్ణయాలేవీ జరగలేవని అన్నారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే ప్రాధాన్యంగా ఉన్నట్టు ఉన్నాయని వివరించారు. ఇండియా కూటమికి సారథిగా కాంగ్రెస్‌ ఉండటానికి తామంతా అంగీకరించామని పేర్కొన్నారు. కాబట్టి, కూటమి సంబంధ నిర్ణయాలపై కాంగ్రెస్ క్రియాశీలకంగా పాల్గొనాల్సి ఉంటుంది. కానీ, ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ తమ వినతులను పట్టించుకునేలా లేదని విమర్శించారు.

ఇండియా కూటమి కోసం విపక్ష పార్టీలతో తొలి సమావేశాన్ని పాట్నాలో నితీశ్ కుమార్ నిర్వహించడం గమనార్హం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో రెండో భేటీని నిర్వహించింది. అనంతరం, మూడో సమావేశం ముంబయిలో జరిగిన సంగతి తెలిసిందే.

click me!