ముస్లిం ఓట్లు తొలగించాలి... బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

Published : Feb 25, 2022, 09:55 AM IST
ముస్లిం ఓట్లు తొలగించాలి... బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

సారాంశం

తాజాగా.. వీరి జాబితాలోకి మరో బీజేపీ ఎమ్మెల్యే చేరడం గమనార్హం.  బిహార్‌లోని బిజెపి ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ ప్రభుత్వం "ముస్లింల నుండి ఓటు హక్కును తీసివేయాలని" డిమాండ్ చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతలు ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు నోరు జారి చేసిన కామెంట్స్ చాలానే వివాదాస్పదమయ్యాయి. తాజాగా.. వీరి జాబితాలోకి మరో బీజేపీ ఎమ్మెల్యే చేరడం గమనార్హం.  బిహార్‌లోని బిజెపి ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ ప్రభుత్వం "ముస్లింల నుండి ఓటు హక్కును తీసివేయాలని" డిమాండ్ చేశారు.


“1947లో దేశాన్ని మతం పేరుతో విభజించి మరో దేశాన్ని సంపాదించుకున్నారు. వారు వేరే దేశానికి వెళ్లాలి. వారు ఇక్కడ నివసిస్తున్నట్లయితే, వారి ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వారు (ముస్లింలు) భారతదేశంలో రెండవ తరగతి పౌరులుగా జీవించగలరు” అని బిజెపి ఎమ్మెల్యే హరిశంకర్ ఠాకూర్ అన్నారు.

దేశంలోని ముస్లింలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలని అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఠాకూర్  ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.

ముస్లింలు దేశంలో ఐఎస్‌ఐ ఎజెండాను నడుపుతున్నారని, భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చే ఎజెండాతో వారు పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

ఈ దేశంలో ముస్లింలు మైనారిటీలేనని, రాజ్యాంగంలో మైనారిటీ అనే పదం లేదని హరిశంకర్ ఠాకూర్ అన్నారు. బీహార్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతున్నాయని, ఈ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వందేమాతరం పాడరని అక్తరుల్ ఇమాన్ చెప్పారు.

సంప్రదాయం ప్రకారం, బీహార్ శాసనసభ సమావేశాలు జాతీయ గీతం జనగణమనతో ప్రారంభమై వందేమాతరంతో ముగుస్తాయి.
 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?