లేడీ టీచర్ ను నమ్మించి మోసం చేసిన కేసులో.. ట్విస్టులు, వెలుగులోకి షాకింగ్ విషయాలు...

Published : Oct 06, 2021, 11:14 AM IST
లేడీ టీచర్ ను నమ్మించి మోసం చేసిన కేసులో.. ట్విస్టులు, వెలుగులోకి షాకింగ్ విషయాలు...

సారాంశం

అదే ఊర్లో ఆ మహిళా ఒక్కతే గది అద్దెకి తీసుకుని ఉంటుంది.  సెప్టెంబర్ 27న కూడా  అతను ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్ళాడు. టీ ఇవ్వమని కోరాడు. ఆమె అయిష్టంగానే టీ పెట్టింది.  కానీ అతడి వక్రబుద్ధి ఊరకనే ఉండదు కదా..  ఆమెను బలవంతం చేసి rape చేసి లొంగదీసుకున్నాడు.

బీహార్ : తనపై అత్యాచారం జరిగిందని ఓ లేడీ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతుండడంతో పోలీసులు విస్తుపోయారు.  ఈ ఘటన  బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలోని  కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఓ పాఠశాల ఉంది.  అందులో ఓ మహిళ teacherగా పని చేస్తుంది.  పాఠశాలలో పనిచేస్తున్న ముంతాజ్ అన్సారీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.  అది కాస్త ప్రేమగా మారింది. అతను, ఆమెను marriage చేసుకుంటానని నమ్మించాడు.  దీంతో ఆ అవకాశం  చిక్కినప్పుడల్లా శారీరకంగా కలిశాడు. పెళ్లి చేసుకోమని ఆ లేడీ టీచర్ అడిగినప్పుడల్లా మాట దాట వేసేవాడు.  ఆమెకు అనుమానం వచ్చి అతనికి దూరం పెట్టడం మొదలు పెట్టింది.

కానీ అతను మాత్రం  ఆమెను వదలలేదు.  అదే ఊర్లో ఆ మహిళా ఒక్కతే గది అద్దెకి తీసుకుని ఉంటుంది.  సెప్టెంబర్ 27న కూడా  అతను ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్ళాడు. టీ ఇవ్వమని కోరాడు. ఆమె అయిష్టంగానే టీ పెట్టింది.  కానీ అతడి వక్రబుద్ధి ఊరకనే ఉండదు కదా..  ఆమెను బలవంతం చేసి rape చేసి లొంగదీసుకున్నాడు.

మైనర్ బాలికపై అత్యాచారం.. కేవలం 9రోజుల్లో శిక్ష..!

ఆ సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు.  ఆ వీడియోలను అతను social mediaలో పోస్ట్ చేశాడు.  దీంతో అవి వైరల్గా మారాయి.  వీడియోలు సోషల్ మీడియాలో కనబడటంతో ఆమె మానసికంగా కుంగి పోయింది.  పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయం మొత్తం చెప్పింది.  నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

లేడీ టీచర్ తో పెళ్లి కాలేదని పరిచయం చేసుకున్న ముంతాజ్ అన్సారీకి ఇంతకుముందే పెళ్లయింది.  అతడికి ఒక బిడ్డ కూడా ఉంది.  అంతేకాకుండా పోలీసులకు మరో విషయం తెలిసింది.  లేడీ టీచర్ కూడా ఇంతకుముందే పెళ్లి అయిందని..  భర్తతో విభేదాలు తలెత్తడంతో అతని నుంచి విడాకులు తీసుకుందని తెలిసింది.  మరింత సమాచారం కోసం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu