భర్త సంసారానికి పనికిరాడన్న భార్య.. వైద్య పరీక్షలు చేయగా..

By telugu news teamFirst Published Dec 7, 2020, 12:09 PM IST
Highlights

 ఇంకేముంది వెంటనే ఇంట్లో పెద్దలకు చెప్పి కోర్టు మెట్లు ఎక్కింది. అక్కడకు వెళ్లాక అతనికి వైద్య పరీక్షలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో కొన్ని నెలల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సమయంలో కొందరు తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. కొందరు మాత్రం కరోనా  కాలంలోనూ తక్కువ మంది అతిథుల మధ్య సింపుల్ గా పెళ్లి కానిచ్చేశారు. అలా కరోనా కాలంలోనే ఓ జంట పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైతే చేసుకున్నారు కానీ.. సదరు యువకుడు.. భార్యను దూరం పెడుతూ వచ్చాడట. శారీరకంగా కలవడానికి భార్య ఎంత ప్రయత్నించినా.. ఆ భర్త మాత్రం ఆమెకు దూరమౌతున్నాడు. దీంతో.. ఆమెకు భర్త మగతనం మీద అనుమానం కలిగింది. ఇన్ని నెలలు తనను దూరం పెడుతున్నాడు అంటే కచ్చితంగా అతను సంసారానికి పనికిరాడని ఆమె నిర్ణయించుకుంది. ఇంకేముంది వెంటనే ఇంట్లో పెద్దలకు చెప్పి కోర్టు మెట్లు ఎక్కింది. అక్కడకు వెళ్లాక అతనికి వైద్య పరీక్షలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను కరోనా భయంతో భార్యను దూరం పెట్టడం గమనార్హం. ఈ సంఘటన భోపాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్ కి చెందిన జంటకు ఈ ఏడాది జూన్ లో వివాహమైంది. అప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు ఉధృతంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడు కరోనా సోకుతుందనే భయంతో భార్య దగ్గరికి వెళ్లేందుకు జంకాడు. దాదాపు మూడు నెలల పాటు అత్తవారింట్లోనే ఉన్న ఆ యువతి తీవ్ర వేదనతో పుట్టింటికి వెళ్లిపోయింది.

రెండు నెలలపాటు అక్కడే గడిపి భరణం కావాలంటూ డిసెంబర్‌ 2వ తేదీన భోపాల్‌ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. పెళ్లయిన ఈ 5 నెలల్లో అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. భర్త ఫోన్‌లో బాగా మాట్లాడేవాడని, దగ్గరకు మాత్రం రాలేదని తెలిపింది. న్యాయాధికారుల కౌన్సెలింగ్‌లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా ఫోబియా కారణంగానే ఆ యువకుడు దాంపత్య విధిని నెరవేర్చలేదని తేలింది. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి, అంతా సరిగ్గా ఉందని ధ్రువీకరించారు. కౌన్సెలింగ్‌ అనంతరం ఆ యువతి భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లిందని భోపాల్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి సందీప్‌ శర్మ తెలిపారు. 
 

click me!