భోపాల్ గ్యాస్ విషాదం కేసు: అదనపు పరిహారం పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Published : Mar 14, 2023, 04:37 PM IST
భోపాల్ గ్యాస్ విషాదం కేసు: అదనపు పరిహారం పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

సారాంశం

Supreme Court: భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసుకు సంబంధించి అదనపు పరిహారం కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ ను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాధితులకు నష్టపరిహారం విష‌యంలో 39 ఏళ్ల తర్వాత  కాకుండా అద‌న‌పు ప‌రిహారం కోసం అప్పుడే ఆందోళన చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  

Bhopal gas tragedy case:  చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత భోపాల్ గ్యాస్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు చెల్లించడానికి యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యూసీసీ) నుండి మ‌రింత ఎక్కువ అద‌న‌పు ప‌రిహారం పొందాలని ప్రభుత్వం దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు మార్చి 14 న తోసిపుచ్చింది. 

వివ‌రాల్లోకెళ్తే.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసుకు సంబంధించి అదనపు పరిహారం కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాధితులకు నష్టపరిహారం విష‌యంలో 39 ఏళ్ల తర్వాత కాకుండా అద‌న‌పు ప‌రిహారం కోసం అప్పుడే ఆందోళన చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పరిహారం పెంచే ప్రయత్నం మూడు దశాబ్దాల తర్వాత కాదనీ, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే చేసి ఉండాల్సిందని పేర్కొంది. సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం బాధితులకు తగిన బీమా పాలసీని తీసుకురావడం ద్వారా లోపాన్ని సరిదిద్దకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును చదివి వినిపించిన జస్టిస్ కౌల్ 1989లో సుప్రీంకోర్టుతో కుదుర్చుకున్న ఒప్పందంలో నిర్ణయించిన 470 మిలియన్ డాలర్ల (అప్పటి మారకం రేటు ప్రకారం సుమారు రూ.725 కోట్లు) నష్టపరిహారాన్ని 'టాప్ అప్' చేయాలని కేంద్రం దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ కు తెలిసిన న్యాయ సూత్రంలో సెటిల్ మెంట్ ఫైన‌ల్ చేయ‌డానికి ఎలాంటి ఆధారం లేదని తెలిపింది. ప్రస్తుతం డౌ కెమికల్స్ అనుబంధ సంస్థ అయిన యూసీసీతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని తేలితే లేదా మోసం వంటి అంశాల‌ ఆధారంగానే దాన్ని పక్కన పెట్టవచ్చని వివరించింది. పురుగుమందుల కంపెనీ నుంచి రూ.675.96 కోట్ల అదనపు నిధుల కోసం ప్రభుత్వం తన వాదనను ఏ కారణం లేకుండా కోరిందని వాద‌న‌లు వినిపించాయి.

బాధితులకు పునరావాసం కల్పించడానికి మరిన్ని వైద్య సదుపాయాలు అవసరమని ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని కోర్టు పేర్కొంది. కాగా, 1984 డిసెంబర్ 2-3 తేదీల మధ్యరాత్రి మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసి) వాయువు  వెలువ‌డి చాలా మంది చ‌నిపోయారు. అనేక మంది ప్ర‌భావిత‌మ‌య్యారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత కేంద్ర ప్రభుత్వం లేదా మధ్యప్రదేశ్ స‌ర్కారు  సంబంధిత ప్ర‌మాద సైట్ ను క్రియాశీలంగా ఉండ‌కుండా నిర్వీర్యం చేయ‌డానికి, వ్య‌ర్థాల‌ను తొల‌గించాడానికి చర్యలు తీసుకోలేదని యూసీసీ ఆరోపణను సైతం ప్రస్తావించింది.

1989 మే 4న కుదిరిన 470 మిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకారం గ్యాస్ లీక్ ఘటనలో 3,000 మరణాలు సంభవించాయి. 2010లో ప్రభుత్వం దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ లో వాస్తవ సంఖ్య 5,295 మరణాలు అని పేర్కొంది. భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వద్ద 22 ఏళ్లకు పైగా గ్యాస్ బాధితుల వైద్య రికార్డులు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్న భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా ఉద్యోగ్ సంఘట‌న్, భోపాల్ గ్యాస్ పీడిత్ సంఘర్ష్ సహాయ్ సమితి కోర్టుకు తెలిపాయి.

ఈ కేంద్రంలో రోజుకు సగటున 2 వేల మంది గ్యాస్ బాధితులు వైద్యం పొందుతున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గ్యాస్ రిలీఫ్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తున్న ఆరు ఆస్పత్రులు, 19 క్లినిక్ లలో మరో 4 వేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన జరిగి దాదాపు 40 ఏళ్ల తర్వాత కూడా గాయాలతో బాధితులు బాధపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే