అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రిని ప్రశ్నించిన జర్నలిస్టు అరెస్టు.. బెయిల్ పై విడుదల.. ఎక్కడంటే? (వీడియో)

Published : Mar 14, 2023, 04:28 PM ISTUpdated : Mar 14, 2023, 04:37 PM IST
అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రిని ప్రశ్నించిన జర్నలిస్టు అరెస్టు.. బెయిల్ పై విడుదల.. ఎక్కడంటే? (వీడియో)

సారాంశం

అభివృద్ధి కార్యక్రమాలు, ఇచ్చిన హామీలపై ఓ జర్నలిస్టు నేరుగా మంత్రిని నిలదీశారు. చెక్ డ్యామ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి గ్రామానికి వచ్చిన మంత్రిపై ప్రశ్నలు గుప్పించారు. ఆ కార్యక్రమం తర్వాత బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా ఆ జర్నలిస్టుపై కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం ఆ జర్నలిస్టు బెయిల్ పై విడుదలయ్యారు.  

లక్నో: అతనో యూట్యూబ్ చానెల్ రన్ చేస్తున్న జర్నలిస్టు. చెక్ డ్యామ్‌కు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రిపై సూటిగా ప్రశ్నలు సంధించారు. మంత్రి వేదికపై కూర్చుని ఉండగా మైక్ పట్టుకుని ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానం ఇవ్వాలని ఆమెకు మైక్ ఇచ్చారు. అతని ప్రశ్నలను పక్కనే ఉన్న కొందరు నేతలు కొట్టివేయాలని చూడగా.. కాదు.. కాదు.. ఇవన్నీ ఈ గ్రామ ప్రజల మనసులోని ప్రశ్నలు అని ఆ జర్నలిస్టు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఆ గ్రామ ప్రజల వైపు తిరిగి అంతేనా కాదా? అని కూడా అడిగి మైక్ మంత్రి చేతికి అందించారు.

మంత్రిపై ప్రశ్నలు కురిపించిన జర్నలిస్టు సంజయ్ రాణాను పోలీసులు అరెస్టు చేశారు. అతను ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన సంభల్ జిల్లాలోని బుధ్ నగర్ ఖాండ్వా గ్రామంలో మార్చి 11వ తేదీన చోటుచేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవీ మార్చి 11వ తేదీన బుధ్ నగర్ ఖాండ్వా గ్రామానికి వెళ్లారు. అక్కడ చెక్ డ్యామ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రిని జర్నలిస్టు పలుప్రశ్నలు వేశారు. ‘ఎన్నికలకు ముందు ఈ గ్రామం మీదేనని మాకు హామీ ఇచ్చారు, ఊరిలోని గుడిలో శపథం తీసుకున్నారు. గ్రామస్తులంతా దత్తత పిల్లలు అని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఊరికి తిరిగి వస్తానని చెప్పారు. కానీ, మీరు గెలిచినా ఇక్కడకు రాలేదు’ అని జర్నలిస్టు అన్నారు.

Also Read: గుజరాత్‌లో హెచ్3ఎన్2‌తో తొలి మరణం.. దేశంలో 500లకు చేరువలో కేసులు

‘గుడి నుంచి ఇక్కడి దాకా రోడ్డు నిర్మిస్తారన్నారు. కానీ, ఇప్పటికే ఆ గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గుడి చుట్టూ ప్రహరి గోడ నిర్మిస్తారని ప్రత్యేకంగా చెప్పారు. కానీ, ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. గ్రామస్తులంతా ఒత్తిడి తేవాలని మీ ఆఫీసుకు వచ్చారు. కానీ, మీరు ఆ విజ్ఞప్తులేమీ ఆలకించలేదు’ అని సంజయ్ రాణా అన్నారు. 

సంజయ్ రాణా ప్రశ్నలకు ఊరి ప్రజలు సమ్మతిస్తున్నట్టు ఓ వీడియోలో వినిపించింది. 

సంజయ్ రాణాకు సమాధానం ఇస్తూ ‘నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే. కానీ, ఇంకా సమయం ఉన్నది. కుందన్‌పుర్ గ్రామం, బుధ్ నగర్ ఖాండ్వాలు నా బాధ్యత అని మరిచిపోవద్దు. నేను చెప్పిన పనులన్నీ అవుతాయి’ అని మంత్రి గులాబ్ దేవీ అన్నారు.

ఈ కార్యక్రమం తర్వాత స్వల్ప వ్యవధిలోనే స్థానిక బీజేపీ నేత శుభమ్ రాఘవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకం కలిగిస్తున్నాడని సంజయ్ రాణాపై కేసు పెట్టారు. చందౌసీ పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. సంజయ్ రాణా బెయిల్ పై విడుదల అయ్యారు.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే