భోపాల్‌లో దారుణం.. మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్ అఘాయిత్యం.. డ్రెస్ మార్చ‌డంతో అనుమానం  

Published : Sep 13, 2022, 11:43 AM IST
భోపాల్‌లో దారుణం.. మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్ అఘాయిత్యం.. డ్రెస్ మార్చ‌డంతో అనుమానం  

సారాంశం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజధాని భోపాల్ లో దారుణం జ‌రిగింది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ 3 ఏళ్ల  చిన్నారితో అసభ్యకర చర్యకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటన సమయంలో మహిళా సహాయకురాలు ఆ డ్రైవ‌ర్ కు స‌హక‌రించ‌డం సిగ్గుచేటు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజధాని భోపాల్ లో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఓ మూడేండ్ల చిన్నారిపై  స్కూల్ బస్సు డ్రైవర్ అఘాత్యానికి పాల్ప‌డ్డారు. చిన్నారి ఒంట్లో నలతగా ఉండడంతో  తల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌డంతో అస‌లు విష‌యం వ‌చ్చింది. ఈ దారుణం గురించి తొలుత‌ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. వారు అంతర్గత విచారణ జ‌రిపి.. అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని బస్సు డ్రైవర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఆగ్ర‌హించిన తల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్రయించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఓ మహిళా సహాయకురాలు కూడా ఉంది. త‌ల్లిదండ్రుల‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌, మ‌హిళ‌ అటెండర్ ని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. భోపాల్‌లోని రాతిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బిల్లా బాంగ్ స్కూల్‌లో చదువుతున్న 3 ఏళ్ల బాలికతో డ్రైవర్ అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగి నాలుగు రోజులైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఓ మహిళా సహాయకురాలు కూడా ఉంది. కానీ ఆమె బాలికను రక్షించలేదు. బాలిక న‌ల‌త‌గా ఉండ‌టంతో కుటుంబీకులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో జ‌రిగిన దారుణం బ‌య‌ట‌ప‌డింది. ఈ దారుణం గురించి తొలుత‌ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. వారు అంతర్గత విచారణ జ‌రిపి.. అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని బస్సు డ్రైవర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఆగ్ర‌హించిన తల్లిదండ్రులు రాతిబార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న‌ పోలీసులు డ్రైవర్‌, మహిళా సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో లైంగిక వేధింపులు జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
 
చిన్నారి డ్రెస్ డ్రెస్ మార్చ‌డంతో అనుమానం

వాస్త‌వానికి.. గురువారం నాడు చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి వ‌చ్చే స‌మ‌యంలో.. డ్రెస్‌ మార్చుకుని ఉండడం చూసి.. ఆ చిన్నారి తల్లి ఆశ్చర్యపోయింది. సాధారణంగా బ్యాగ్‌లో అదనపు దుస్తులను పెడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా ఆ డ్రెస్ వేసుకోదు. దీంతో సందేహం వ‌చ్చిన త‌ల్లి..  బట్టలు ఎవరు మార్చారని చిన్నారిని అడిగింది. కానీ ఆ చిన్నారి చెప్పలేకపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేశారు. స్కూల్లో బట్టలు మార్చుకోలేద‌ని తెలిపారు. అదే సమయంలో  ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌లో నొప్పి వస్తోందని ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత పెరిగింది. ఈ విష‌యాన్ని ఏసీపీ మహిళా సురక్షా నిధి సక్సేనా తెలిపారు.

అనంత‌రం చిన్నారిని, త‌ల్లిదండ్రుల‌ను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేశారు, ఆ తర్వాత బస్సు డ్రైవర్ తనతో తప్పు చేశాడని, బట్టలు మార్చింది తానేనని బాలిక చెప్పిందని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు, అక్కడ బాలిక పాఠశాల డ్రైవర్‌ను గుర్తించింది. పాఠ‌శాల యాజ‌మాన్యానికి చెప్పిన ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో సోమవారం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌, మ‌హిళ‌ అటెండర్ ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌లో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అత్యాచార ఘటనలు నిత్య‌కృత్యంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సోమవారం నాడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కత్నీలోని అమ్హేతాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన హృదయ విదారక సంఘటన గురించి కమల్ నాథ్ ట్వీట్ చేశారు. స్థానిక గ్రామస్తులే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం, నిందితుడు పోలీసుల అదుపు నుంచి పారిపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇదీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితని, అక్కాచెల్లెళ్లు, కూతుళ్లకు భద్రత కల్పించడంలో శివరాజ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేలిందని విమ‌ర్శించారు.

దేశంలోనే చిన్నారులపై నేరాల్లో మధ్యప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం, 2021లో దేశంలో చిన్నారుల‌పై అత్యధిక నేరాలు నమోదయ్యాయి. నివేదిక ప్రకారం.. 2021లో పిల్లలపై నేరాలకు సంబంధించి 19173 కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu