బ‌రేలీలో విషాదం .. మొబైల్ ఫోన్ పేలి.. ఎనిమిది నెల‌ల‌ చిన్నారి మృతి.. 

By Rajesh KarampooriFirst Published Sep 13, 2022, 10:52 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో  మొబైల్ ఫోన్  బ్యాటరీ పేలడంతో (మొబైల్ ఫోన్ బ్లాస్ట్) ప‌క్క‌నే ఉన్న మంచానికి మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో మంచంపై నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారి తీవ్రంగా  గాయ‌ప‌డి.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి త‌న‌ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేశాడు.దీంతో అకస్మాత్తుగా ఫోన్ బ్యాటరీ పేలి (మొబైల్ ఫోన్ బ్లాస్ట్) ప‌క్క‌నే ఉన్న మంచానికి మంటలు అంట‌కున్నాయి. ఈ క్రమంలో మంచంపై నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారి తీవ్రంగా  గాయ‌ప‌డి.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 

అసలు ఏం జ‌రిగిందంటే.. ?

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. బ‌రేలీ ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చుమి గ్రామంలో  నివాసిస్తున్న‌ సునీల్ సోమవారం మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వ‌చ్చారు. అనంత‌రం తన ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి కింద‌కు వ‌దిలేశాడు. అయితే.. ప‌క్క‌నే ఉన్న మంచంపై త‌న ఎనిమిది నెలల కూతురు నేహా పడుకుని ఉంది. ఆక‌స్మికంగా ఛార్జింగ్‌లో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మొబైల్ పేలి బెడ్‌పై పడింది. దీంతో బెడ్‌లో మంటలు చెలరేగాయి. బాలిక కేకలు విని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడారు, అయితే అప్పటికే ఆ చిన్నారి తీవ్రంగా గాయ‌ప‌డింది. వెంట‌నే ఆ చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

బాధితురాలి తల్లి కుసుమ మాట్లాడుతూ.. తాను ఆరుబయట బట్టలు ఉతుకుతుండగా.. పెద్ద శ‌బ్ధం వ‌చ్చిందనీ, త‌న కూతురు అరుపులు విన్న వెంట‌నే.. పరుగున అక్కడికి చేరుకున్నాన‌నీ, ఆ లోపే త‌న చిన్నారి తీవ్రంగా గాయ ప‌డింద‌ని తెలిపారు.
  
ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు 

ఛార్జింగ్ సమయంలో మొబైల్ పేలడం ఇదే మొదటిసారి కాదు. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునార‌వృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

1. రాత్రిపూట మొబైల్‌ని ఛార్జ్‌లో ఉంచవద్దు. దీంతో మొబైల్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది.
2. మొబైల్ ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే పెట్టాలి. ఇది కాకుండా, మీ బ్యాటరీ దెబ్బతిన్నట్లయితే.. లోక‌ల్  బ్యాటరీని ఉపయోగించవద్దు.
3. ఛార్జింగ్ కోసం ఎల్లప్పుడూ స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జర్‌ని ఉపయోగించండి
4. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్‌ను పదే పదే చార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి బ్యాటరీ 20 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడే ఫోన్‌ను ఛార్జ్ చేయాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి ఉండదు, బ్యాటరీ త్వరగా చెడిపోదు.

click me!