రోడ్డు ప్రమాదంలో సరబ్ జిత్ సింగ్ భార్య కన్నుమూత...

By Bukka SumabalaFirst Published Sep 13, 2022, 11:02 AM IST
Highlights

ఉగ్రవాద ఆరోపణలతో పాక్ జైల్లో మరణించిన భారతీయుడు సరబ్‌జిత్ సింగ్ భార్య సుఖ్‌ప్రీత్ కౌర్ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.

ఛండీగఢ్ : ఉగ్రవాద ఆరోపణలతో యేళ్ల తరబడి పాక్ జైల్లో మగ్గి.. తోటి ఖైదీల చేతిలో ప్రాణాలు వదిలి భారతీయుడు సరబ్ జిత్ సింగ్ గుర్తున్నారా? ఆయన భార్య సుఖ్ ప్రీత్ కౌర్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. టూవీలర్ పై వెడుతున్న సమయంలో ఫతేహాపూర్ వద్ద వెనకాల కూర్చున్న సుఖ్ ప్రీత్ కౌర్ కిందపడిపోయారు. 

దీంతో తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మంగళవారం తర్న్ తరన్ లోని ఆమె స్వస్థలం భిఖివిండ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. సరబ్ జిత్ సింగ్-సుఖ్ ప్రీత్ కౌర్ లకు ఇద్దరు సంతానం. జూన్ లో సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్ ఛాతి నొప్పితో కన్నుమూశారు. సరబ్ జిత్ విడుదల కోసం దల్బీర్ కౌర్, సుఖ్ ప్రీత్ చేసిన పోరాటం.. స్థిరస్థాయిగా గుర్తిండిపోయింది కూడా.

బ‌రేలీలో విషాదం .. మొబైల్ ఫోన్ పేలి.. ఎనిమిది నెల‌ల‌ చిన్నారి మృతి..

ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో పట్టుబడ్డ సరబ్ జిత్ సింగ్ కు పాక్ కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే, ఆ శిక్షను పలుకారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 2013, ఏప్రిల్ లో తోటి ఖైదీల చేతిలో లాహోర్ జైల్లో దాడికి గురై.. కన్నుమూశారు. మరణాంతరం ఆయన మృతదేహాన్ని అమృత్ సర్ కు తీసుకువచ్చి.. అంత్యక్రియలు నిర్వహించారు. 
 

click me!