
Pegasus spyware: మళ్లీ దేశంలో పెగాసస్ స్పై వేర్ దుమారం రేపుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు పెగాసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. తమకు చెందిన గ్యాడ్జెట్స్ లోకి పెగాసస్ ను పంపించి..నిఘా పెట్టారని పేర్కొంటున్న వారు తమ డివైస్‌లను అందించాలని సుప్రీంకోర్టు ప్యానెల్ ఇదివరకే పేర్కొంది. ఈ క్రమంలోనే భీమా కోరేగావ్-ఎల్గర్ పరిషత్ (Bhima Koregaon) కేసులో నిందితులుగా ఉన్న పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, రచయితలు తమ మొబైల్ డివైస్ లను పరిశీలించాలని సుప్రీంకోర్టు పెగాసస్ స్పైవేర్ పై ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ కోరారు.
ఈ మేరకు సుప్రీం (Supreme Court) ప్యానెల్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే భీమ కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో ఏడుగురు నిందితుల స్వాధీనం చేసుకున్న మొబైల్ హ్యాండ్ సెట్లను పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) వినియోగంపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి అప్పగించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ప్రత్యేక ఎన్ ఐఏ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి డీఈ కొతాలికర్.. ఎన్ఐఏ చేసిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోర్టు కస్టడీలో ఉన్న నిందితుల ఫోన్లు, ఇతర ఎలక్ట్రానికి పరికరాలను విశ్లేషణ కోసం సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి అందించనున్నారు. రిజిస్ట్రార్ ఈ పరికరాలను బుధవారం దర్యాప్తు అధికారికి ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం వారు దానిని సుప్రీంకోర్టు (Supreme Court)కమిటీకి సమర్పిస్తారు
తమ ఫోన్లను పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) ను ఉపయోగించి నిఘా పెట్టి ఉంటారనీ, వీటిని పరిశీలించాలని రాతపూర్వకంగా భీమా కోరేగావ్-ఎల్గర్ పరిషత్ (Bhima Koregaon) కేసు నిందితులు పెగాసస్ స్పైవేర్ పై ఏర్పాటైన టెక్నికల్ కమిటీ లేఖ రాశారు. వారిలో ఏడుగురు నిందితులు రోనా విల్సన్, ఆనంద్ తెల్తుంబ్డే, వెర్నాన్ గోన్సాల్వేస్, పి. వరవరరావు, సుధా భరద్వాజ్, హనీ బాబు, షోమా సేన్ లు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ వో సంస్థ పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) ను తయారు చేసింది. ఈ పెగాసస్ స్పైవేర్‌ని ఉపయోగించి దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, కార్యకర్తలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court) లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే అక్టోబరు 2021లో దేశ అత్యున్నత న్యాయస్థానం పెగాసస్ నిఘా ఆరోపణలను పరిశీలించడానికి స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
పెగాసస్ (Pegasus spyware) నిఘా ఆరోపణలను పరిశీలిస్తున్న ఈ కమిటీ పనితీరును రిటైర్డ్ సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ పర్యవేక్షిస్తున్నారు. మరో ఇద్దరు ఇందులో సభ్యులుగా ఉన్నారు. తమకు చెందిన గ్యాడ్జెట్స్ లోకి పెగాసస్ ను పంపించి..నిఘా పెట్టారని పేర్కొంటున్న వారు తమ డివైస్‌లను అందించాలని సుప్రీంకోర్టు ప్యానెల్ ఇదివరకే పేర్కొంది. అయితే, ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే స్పైవేర్ (Pegasus spyware) బారినపడిందని పేర్కొంటూ తమ ఫోన్లను అందించారని ఇటీవలే ఈ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు టెక్నికల్ కమిటీ మళ్లీ మరో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. తమ ఎలక్ట్రానికి పరికరాలు (మొబైల్, ల్యాప్‌టాప్ సంబంధిత ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్) ను తమకు అందించాలనీ, సంబంధిత వ్యక్తులు తమను సంప్రదించాలని ఆ ప్రకటనలో సుప్రీంకోర్టు (Supreme Court) ప్యానెల్ పేర్కొంది. ఫిబ్రవరి 8 వరకు అభ్యర్థనలు స్వీకరిస్తామని తెలిపింది.