బీహార్ లో ఎంత మంది మద్యం మానేశారు ? గ‌ణ‌న నిర్వ‌హించనున్న నితీష్ ప్ర‌భుత్వం

Published : Feb 08, 2022, 03:10 PM IST
బీహార్ లో ఎంత మంది మద్యం మానేశారు ? గ‌ణ‌న నిర్వ‌హించనున్న నితీష్ ప్ర‌భుత్వం

సారాంశం

2016 బీహార్ లో మద్య పాన నిషేదం నిర్వహించిన నాటి నుంచి ఎంత మంది ప్రజలు మద్యానికి దూరంగా ఉంటారని తెలుసునేందుకు ప్రభుత్వం గణన నిర్వహించనుంది. ఈ మేరకు నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. 

బీహార్ (bihar)లో 2016 ఏప్రిల్ నుంచి నితీష్ కుమార్ ప్ర‌భుత్వం (nithish kumar government) మ‌ద్యపాన నిషేద చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది మద్యపానానికి దూరంగా ఉంటున్నారో తెలుసుకునేందుకు గ‌ణ‌న నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.

‘‘గత సర్వే ప్రకారం 1.64 కోట్ల మంది మద్యాన్ని విడిచిపెట్టారు, ఇప్పుడు మద్యం విడిచిపెట్టిన వారి సంఖ్యను తెలుసుకోవడానికి మేము గణన నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’’ అని బీహార్ సీఎం నితీష్ కుమార్ (bihar cm nithish kumar ) సోమ‌వారం సాయంత్రం మీడియాతో చెప్పారు. మద్యం మాఫియాలపై చర్యలు కొనసాగించాలని తమ ప్ర‌భుత్వం మద్య నిషేధ విభాగంతో పాటు పోలీసు జిల్లా పరిపాలనల విభాగాల‌ను ఆదేశించింది. అయితే వారు డ్రోన్లు (drons), మోటారు పడవలు (motor boats), 
స్నిఫర్ డాగ్స్ (sniffer dogs) మొదలైన వాటి సహాయం తీసుకోవాని సాధ్య‌మైనంత వ‌ర‌కు మ‌ద్యం త‌యారీ యూనిట్లను గుర్తించి వాటిని కూల్చివేయాలి అని తెలిపారు. మద్యం నిర్వాహకులపై ప్రాసిక్యూషన్ వేగవంతం చేయాలని తాము అధికారులను ఆదేశించామ‌ని తెలిపారు. 

బీహార్‌లో పాలు, స్వీట్లు, కూరగాయలు, పండ్ల వినియోగం గణనీయంగా పెరిగింద‌ని నితీష్ కుమార్ యాద‌వ్ అన్నారు. ఇది త‌మ‌కు చాలా సంతోష‌క‌ర‌మైన విష‌యంమ‌ని, త‌మ‌కు ప్రోత్సాహకరమైన సంకేతం లాంటిద‌ని చెప్పారు. కాగా 2016 ఏప్రిల్‌లో బీహార్‌లో మద్యపాన నిషేధం విధించారు. ఆ తర్వాత కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి.

బీహార్‌లో ప్రజలు చనిపోవడానికి క‌ల్తీ మద్యం సేవిస్తున్నార‌ని ఈ నెల ప్రారంభంలో జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే గోపాల్ మండల్ (gopal mandal) వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదానికి దారి తీసింది. విషపూరితమైన మద్యం తాగకుండా ఉండాలని సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని, అయిన‌ప్ప‌టికీ ప్రజలు కల్తీ మద్యం తయారు చేసి తాగుతున్నారని ఆయ‌న అన్నారు. అయితే చనిపోవడానికే వాళ్లు కల్తీ మద్యం తాగుతున్నారని ఆయ‌న చెప్పారు. బీహార్‌లో కల్తీ మద్యం సేవించి చనిపోయే ఆచారం చాలా మంచిదని, ఇది సమాజంలో స్థలాన్ని సృష్టిస్తుంద‌ని, రాష్ట్రంలో జనాభాను తగ్గిస్తుంద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ మా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ ప్రజలను మద్యం సేవించకూడదని క్రమం తప్పకుండా హెచ్చరిస్తున్నారు. అయినా వారు ఎందుకు మళ్లీ అలానే చేస్తున్నారు ? ’’ అని ఆయన ప్రశ్నించారు. 

ఈ ఏడాది జనవరిలో క‌ల్తీ మ‌ద్యం వ‌ల్ల మూడు ఘ‌ట‌న‌లు సంభవించాయి, దీని ఫలితంగా 37 మంది మరణించారు. 50 మందికి పైగా కంటిచూపు కోల్పోయారు. దీంతో ప్ర‌భుత్వంపై కొంత మేర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !