రాహుల్ గాంధీ (Rahul gandhi)ని రీలాంచ్, రీబ్రాండింగ్ చేయడమే భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)ముఖ్య ఉద్దేశమని బీజేపీ (BJP)నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీలో న్యాయం జరగడం లేదని అన్నారు. అందుకే పార్టీని నాయకులు వీడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పై బీజేపీ విమర్శలు చేసింది. ఈ ప్రచారం ఒట్టి భ్రమ అని పేర్కొంది. ఈ మార్చ్ ఉద్దేశం రాహుల్ గాంధీని రీలాంచ్ చేస్తూ, రీబ్రాండింగ్ చేయడమే అని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ నాయకుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో ఆ పార్టీ నేతలకు న్యాయం జరగడం లేదని అన్నారు. కొన్నేళ్లుగా పార్టీని వీడిన కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ నాకేమైనా మేనమామనా ? ఆయనను నేనెందుకు ద్వేషిస్తాను - సినీ నటుడు ప్రకాశ్ రాజ్
నేడు కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ప్రజలకు న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారని, కానీ వారి పార్టీ నాయకులకే న్యాయం జరగడం లేదని అన్నారు. ఒకరి తర్వాత ఒకరు బడా నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఇప్పుడు మిలింద్ దేవ్రా కూడా వెళ్లిపోయారని గుర్తు చేశారు. న్యాయం జరగక కాంగ్రెస్ ను వీడే వారి సంఖ్య పెరుగుతోందని ఠాకూర్ అన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్.. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన బీజేపీ ఫైర్ బ్రాండ్..
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సంకోచిస్తున్నాయని అన్నారు. మునిగిపోతున్న ఓడలో ప్రయాణించడానికి ఎవరూ ఇష్టపడరని తెలిపారు. కాగా.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని రీలాంచ్ చేయడం, రీబ్రాండింగ్ చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని అన్నారు.
విషాదం.. మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాను మృతి
‘‘కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లకు రాహుల్ పై విశ్వాసం లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. పార్టీ నెమ్మదిగా ఇండియా కూటమిలో స్థానం కోల్పోతుండటంతో కచ్చితంగా రాహుల్ గాంధీని రీలాంచ్ చేయడం, రీబ్రాండింగ్ చేయడం కోసమే ఈ యాత్ర చేపట్టారు’’ అని విమర్శించారు.
మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి - భారత్ కు మాల్దీవుల అల్టీమేటం..
యాత్రకు వ్యతిరేకంగా సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ నేతలు చేసిన వ్యాఖ్యలను పూనావాలా ప్రస్తావిస్తూ ‘‘యాత్ర ప్రజల్లో ఎంత విశ్వాసాన్ని కలిగిస్తుందనేది వేరే అంశం. కానీ రాహుల్ గాంధీ ఈ యాత్రను వదిలేసి ఇండి జోడో యాత్రను ప్రారంభించాలని నేను భావిస్తున్నాను. కూటమి నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. ’’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్రను హింసాత్మక మణిపూర్ లోని తౌబాల్ జిల్లా ఇంఫాల్ సమీపంలో ప్రారంభించారు.