ఫిబ్రవరి 2న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌లోకి ప్రవేశించింది. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపాయ సోరెన్ రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు.
జార్ఖండ్ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందోల భాగంగా సోమవారం జార్ఖండ్‌లో యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాలో ఓ యువకుడు 200 కిలోల బొగ్గును సైకిల్ కు కట్టుకుని వెడుతుండడం చూసిన రాహుల్ గాంధీ... కాసేపు ఆ సైకిల్ ను తోశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఉన్నారు. రాంచీకి వెళుతుండగా, రోడ్డుపై కార్మికులు సైకిళ్లపై 200 నుంచి 250 కిలోల బరువైన బొగ్గును తీసుకెళ్లడం చూశారు. వెంటనే రాహుల్ గాంధీ తన వాహనం దిగి కార్మికులకు అభివాదం చేశారు.
వారితో కాసేపు ముచ్చటించిన ఆయన.. అందులో "ఓ యువ కార్మికుడికి" చెందిన సైకిల్‌ను నెట్టడానికి ప్రయత్నించారు. సీనియర్ కాంగ్రెస్ నేత.. చేసిన ఈ పనికి చెందిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది.
ఎక్స్ లో ఈ ఫొటోలను షేర్ చేస్తూ... 200నుంచి 250 కిలోల బొగ్గును సైకిల్ పై మోస్తూ ఆ వ్యక్తి ప్రతిరోజూ 30-40 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. ఇంత కష్టపడి పని చేసినా, ఈ పని నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువ.. అని ఆ యువకుడు చెప్పినట్లు పార్టీ పేర్కొంది.
‘భారతదేశం గర్విస్తోంది’ : గ్రామీ విజేతలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లకు ప్రధాని అభినందనలు..
దేశ నిర్మాణంలో నిమగ్నమైన ఈ కార్మికులు తమ కష్టానికి తగిన వేతనాలు పొందాలి, వారికి న్యాయం చేయాలి... ఇదే యాత్ర లక్ష్యం..
ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, వారికి విన్నవించడం, వారికి న్యాయం చేయడమే యాత్ర లక్ష్యం’ అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌లోకి ప్రవేశించింది. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపాయ సోరెన్ రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. జార్ఖండ్ లో ప్రవేశించిన మరుసటి రోజు జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధఈ, జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి ప్రయత్నించిందని, అయితే భారత ప్రతిపక్ష కూటమి దాని "కుట్ర"కు వ్యతిరేకంగా నిలబడిందని అన్నారు.
బీజేపీకి ధనబలం, దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, అయితే కాంగ్రెస్ కానీ, తాను కానీ వాటికి భయపడేది లేదని, అధికార పార్టీ విభజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. ఫిబ్రవరి 2న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సోరెన్, సోమవారం నాడు జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో గెలిచారు. ఆయన న్యాయ్ యాత్రకు పూర్తి మద్దతునిస్తానని హామీ ఇచ్చారు.

झारखंड में एक युवा श्रमिक साइकिल पर करीब 200 किलो कोयला लेकर बेचने जा रहा था।

इस युवा ने बताया कि रोज तकरीबन 30-40 किलोमीटर चलना होता है। मेहनत के हिसाब से इस काम में आमदनी बेहद कम है।

भारत निर्माण में लगे इन श्रमिकों को उनकी मेहनत के बराबर मेहनताना मिले, उन्हें न्याय मिले...… pic.twitter.com/ecErDLjPnj
— Congress (@INCIndia) February 5, 2024