Bank Strike: అల‌ర్ట్.. సోమ-మంగళవారాల్లో బ్యాంక్ సేవల‌కు అంత‌రాయం !

Published : Mar 27, 2022, 04:38 AM IST
Bank Strike: అల‌ర్ట్.. సోమ-మంగళవారాల్లో బ్యాంక్ సేవల‌కు అంత‌రాయం !

సారాంశం

Bank Strike:  ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో బ్యాంకులు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సోమవారం-మంగళవారం నాడు బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని ఎస్‌బీఐ త‌న‌ ఖాతాదారులకు తెలియ‌జేసింది.    

Bank Strike: కార్మికులను ప్రభావితం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమ, మంగళవారాల్లో (మార్చి 28, 29) దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. బ్యాంకింగ్ రంగం సమ్మెలో పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది.

మార్చి 22, 2022న కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సమావేశం తర్వాత దేశవ్యాప్త సమ్మెకు పిలుపు పిలుపునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో సన్నాహాలను పరిశీలించిన తర్వాత, యూనియన్లు కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు అఖిల భారత సమ్మెను ప్రకటించాయి. .   

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 28 , మరియు 29 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

రిటైర్‌ కానున్న కార్మికులకు బ్యాంకుల వద్ద పెన్షన్‌లు ఉన్నాయని, వారు సమ్మెలో పాల్గొంటే ప్రభావితం కాదన్నారు.  బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. రైల్వేలు మరియు రక్షణ రంగంలోని యూనియన్లు దేశవ్యాప్తంగా అనేక వందల ప్రదేశాలలో సమ్మెకు మద్దతుగా భారీ సమీకరణ చేయనున్నాయి. దీంతో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న సమ్మె ప్రభావం జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu