భవానీపూర్ ఉపఎన్నిక: బీజేపీ- తృణమూల్ కార్యకర్తల ఘర్షణ, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Sep 30, 2021, 6:34 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ ఉపఎన్నిక సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో బీజేపీ- టీఎంసీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అలాగే బీజేపీ నేత కల్యాణ్ చౌబేర్ కారు ధ్వంసమైంది. 

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ ఉపఎన్నిక సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో బీజేపీ- టీఎంసీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అలాగే బీజేపీ నేత కల్యాణ్ చౌబేర్ కారు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలను చెదరగొట్టారు. నకిలీ ఓట్లు వేయించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్ధితుల మధ్యే భవానీపూర్‌లో ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. 

ఇటీవలే జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటికీ సువేందు అధికారిపై ఆమె ఓడిపోయారు. టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగా ప్రమాణం తీసుకున్న ఆరు నెలల్లోపు ఆమె శాసనసభకు ఎన్నిక కావల్సి ఉన్నది. లేదంటే మంత్రి పదవి కోల్పోతారు. అందుకే ఈ ఎన్నికకు ప్రాధాన్యత సంతరించింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలోనూ మమతా బెనర్జీకి ఈ ఎన్నిక ఒక లిట్మస్ పరీక్ష అని చెబుతున్నారు.

click me!