మేఘాలయాలో నదిలో పడిన బస్సు: ఆరుగురు మృతి

By narsimha lodeFirst Published Sep 30, 2021, 4:06 PM IST
Highlights

మేఘాలయ రాష్ట్రంలో రింగ్జి నదిలో బస్సు పడిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఇప్పటికే 4 మృతదేహలను వెలికితీశారు. మరో రెండు మృతదేహలు బస్సులోనే ఉండిపోయాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

షిల్లాంగ్: మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలో  గురువారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఆరుగురు(six) మరణించారు.  తురా (tura )నుంచి షిల్లాంగ్ (shillong)వెళ్తున్న బస్సు నోంగ్‌చ్రామ్ ప్రాంతంలోని రింగ్ది నదిలో (Ringdi river)పడిపోయింది. బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది  ప్రయాణీకులున్నారు.

నాలుగు మృత దేహాలను వెలికి తీశారు.మరో రెండు మృత దేహాలు బస్సులోనే చిక్కుకొని ఉన్నాయి. చిక్కుకున్న మృతదేహాలతో పాటు మరికొంతమంది ప్రయాణికులను వెలికి తీయడానికి పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 16 మంది ప్రయాణీకులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అతివేగంతో వెళ్తుందని క్షతగాత్రులు తెలిపారు.బస్సు ముందు బాగం బ్రిడ్జి సైడ్ వాల్ ను ఢీకొని నదిలో పడిపోయింది.  ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!