పెళ్లి కాకుండానే గర్భం.. అప్పుడే పుట్టిన బిడ్డను కిటికీలో నుంచి..

Published : Aug 07, 2021, 08:31 AM ISTUpdated : Aug 07, 2021, 08:35 AM IST
పెళ్లి కాకుండానే గర్భం.. అప్పుడే పుట్టిన బిడ్డను కిటికీలో నుంచి..

సారాంశం

ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రి కి డెలివరీ కి వెళ్లింది. అక్కడ ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను  వదిలించుకోవడానికి ఆ మహిళ దారుణంగా ప్రవర్తించింది. 

పెళ్లి కాకుండానే తొందరపడింది.  ఆ తొందరపాటు గర్భానికి దారి తీసింది. తర్వాత బిడ్డ పుట్టాక.. ఆ బిడ్డను కిటికీలో నుంచి కిందకు పడేసింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులోని హెసరఘట్ట ప్రాంతానికి చెందిన యువతి(22) పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ క్రమంలో.. ఆమెకు నెలలు కూడా నిండాయి. దీంతో.. ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రి కి డెలివరీ కి వెళ్లింది. అక్కడ ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను  వదిలించుకోవడానికి ఆ మహిళ దారుణంగా ప్రవర్తించింది. బిడ్డను కిటికీ లో నుంచి కిందకు విసిరేసి.. అక్కడి నుంచి పరారయ్యింది.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్‌ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్‌ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌