డేంజర్ డేటింగ్ యాప్... నగ్నంగా వీడియో కాల్.. టెకీకి 16 లక్షలకు టోకరా..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 18, 2020, 02:28 PM IST
డేంజర్ డేటింగ్ యాప్... నగ్నంగా వీడియో కాల్.. టెకీకి 16 లక్షలకు టోకరా..

సారాంశం

డేటింగ్‌ యాప్‌ ఓ టెకీని డేంజర్ లో పడేసింది. ఏకంగా 16 లక్షలకు ముంచేసింది. యాప్‌లో పరిచయమైన యువతులు ఆ యువకుడ్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఏకంగా 16 లక్షల రూపాయలు దోచేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. 

బెంగళూరుకు చెందిన ఓ టెకీకి డిసెంబర్‌ 3న ఓ డేటింగ్‌ యాప్‌లో శ్వేత అనే యువతి పరిచయమైంది. తనకు అత్యవసరం ఉందని ఓ రెండువేల రూపాయలు డిజిటల్‌ పేమెంట్‌ చేయాలని అడిగింది. టెకీ సరే నన్నాడు. అయితే దీనికి తన ఫ్రెండ్ నెం. కు పంపమంటూ నిఖిత అనే అమ్మాయి నెంబర్ ఇచ్చింది. 

కాసేపటి తరువాత సదరు నిఖిత అనే అమ్మాయి టెకీకి నగ్నంగా వీడియో కాల్‌ చేసింది. అతడు వీడియో కాల్‌లో నగ్నంగా ఉన్న ఆమెను చూశాడు. ఈ వీడియో కాల్‌ను నిఖిత రికార్డ్‌ చేసింది. ఆ తరువాత వీడియోను అడ్డం పెట్టుకుని టెకీని బెదిరించారు. 

ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు ప్రీతి అగర్వాల్‌, షెరైన్‌ లు కలిసి తాము అడిగినంత డబ్బులు చెల్లించకపోతే వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామంటూ బెదిరించసాగారు. 

ఇలా అతడి వద్ద నుంచి డిసెంబర్‌ 3-13 వరకు 10 రోజుల్లో 16 లక్షల రూపాయలు దోచేశారు. దీంతో విసిగెత్తిపోయిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Spa Center : స్పా ముసుగులో అసలు కథ వేరే ఉంది.. కండోమ్‌ల కుప్పలు చూసి షాకైన పోలీసులు