కాలేజీ రోజుల్లో క్లర్కుతో ఎఫైర్.. 21యేళ్ల పాటు వెంటాడి, వేటాడి.. చివరకు...

By AN TeluguFirst Published Dec 18, 2020, 12:58 PM IST
Highlights

కాలేజీ రోజుల్లో జరిగిన ఓ చిన్న పొరపాటు చివరికి ఆ మహిళ ప్రాణాలు తీసింది. 21యేళ్ల పాటు ఆమెను వేధించి, వేదించి చివరికి ఆమె మరణంతో ముగిసింది. కాలేజీ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయికి అక్కడి క్లర్కుతో ఎఫైర్‌ ఏర్పడింది. దాన్ని సాకుగా తీసుకుని ఆమెను 21 ఏళ్లుగా వేధింపులకు గురి చేసిన సదరు క్లర్కు, స్నేహితుల సహాయంతో దారణంగా హత్య చేసి, ఇంటిని ఆక్రమించుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ మహిళకు కాలేజీ చదువుతున్న సమయంలో రమేష్‌ సింగ్‌ అనే క్లర్క్‌తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు ఫొటోలు, వీడియోలు తీశాడు రమేష్‌. 

ఆ తర్వాత కాలేజీ అయిపోయాక బయటకొచ్చిన ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. కానీ రమేష్‌ ఆమెను వదల్లేదు. బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆ తరువాత ఆమె పెళ్లి చేసుకున్నా అతడి వేధింపులు ఆగలేదు. అంతేకాదు తమ సంబంధం విషయం ఆమె భర్తకు కూడా చెప్పాడు. దీంతో ఆమెకు భర్త విడాకులిచ్చాడు. 

ఆ మహిళ తల్లితండ్రులతో పాటూ ఉండేది. కొద్ది కాలానికి తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత రమేష్‌ తరుచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. అతడి ఇద్దరు స్నేహితులు చం‍ద్ర శేఖర్‌, దిలీప్‌ కుమార్‌లను కూడా వెంట బెట్టుకెళ్లేవాడు. 

2020 మార్చి 12న మహిళ తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని పాతి పెట్టేశారు. అనంతరం ఆమె బంగారు నగలను దోచుకుని, ఇంటిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. కూతురు కనిపించకపోవటంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. 

ఆ ముగ్గురు తన కూతుర్ని హత్య చేశారని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేయటానికి రంగం సిద్ధం చేశారు.

click me!