యువ బీజేపీ ఎంపీ హత్యకు కుట్ర...ఛేదించిన పోలీసులు

By telugu teamFirst Published Jan 18, 2020, 4:25 PM IST
Highlights

ఇటీవల బెంగళూరు లోని టౌన్‌హాల్‌ వద్ద సీఏఏకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళుతున్న ఆరెస్సెస్ కార్యకర్త వరుణ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు ఎస్‌డీపీఐ(సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కార్యకర్తలను అరెస్ట్ చేసారు. పోలీసులు వారిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బెంగళూరు: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసనలను, మద్దతును ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగఇలాంటి ఒక పౌరసత్వ సవరణ చట్టం మద్దతు ర్యాలీలో పాల్గొని ఇంటికి తిరిగివెళ్తున్న ఒక వ్యక్తిని కొందరు హత్యా చేయడానికి ప్రయత్నించారు.

నిందితులను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు వారు చెప్పిన విస్తుపోయే విషయాలను చూసి అప్రమత్తమై ఒక భారీ హత్యను జరగకుండా ఆపగలిగారు. 

వివరాల్లోకి వెళితే... ఇటీవల బెంగళూరు లోని టౌన్‌హాల్‌ వద్ద సీఏఏకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళుతున్న ఆరెస్సెస్ కార్యకర్త వరుణ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు ఎస్‌డీపీఐ(సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) కార్యకర్తలను అరెస్ట్ చేసారు. పోలీసులు వారిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also read: పౌరసత్వ సవరణ చట్టం : నిరసన తెలపడానికి బోటులో ప్రయాణం...

బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్యతోపాటు యువ బ్రిగేడ్‌ సంస్థాపక అధ్యక్షుడు చక్రవర్తి సూలిబెలె హత్యకు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు యువ బ్రిగేడ్‌ నేత చక్రవర్తి సూలిబెలెలను హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు ఆరుగురు నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. 

ఈ నిందితుల వివరాలను బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ భాస్కర్‌రావు మీడియాకు తెలిపారు. ఎస్‌డీపీఐ కార్యకర్తలను కోర్టులో హాజరుపరిచి సమగ్ర విచారణ కోసం కస్టడీకి తీసుకోనున్నట్టు కమీషనర్ తెలిపారు. 

Also read: సిఏఏ ఎఫెక్ట్: ప్రధాని మోడీకి రామకృష్ణ మఠం షాక్...

Also read: సీఏఏపై కేంద్రానికి కేరళ తర్వాత పంజాబ్ కేంద్రానికి షాక్

ఈ సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా బెంగుళూరు అంతా ఉలిక్కి పడింది. ఒక ఎంపీ మీదనే హత్యాయత్నానికి ప్రయత్నిస్తుంటే... సామాన్యులకు రక్షణ ఉంటుందా అని సామయ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు దాడులు ప్రతి దాడుల నుండి రాజకీయ హత్యల వరకు దారితీయడం మొదలుపెట్టిందన్నట్టు. 

click me!