అద్భుత గాత్రంతో అలరిస్తున్న బెంగళూరు బాలిక.. అమెరికన్ సింగర్ నుంచి ప్రశంసలు

Published : Aug 23, 2021, 07:49 PM IST
అద్భుత గాత్రంతో అలరిస్తున్న బెంగళూరు బాలిక.. అమెరికన్ సింగర్ నుంచి ప్రశంసలు

సారాంశం

బెంగళూరుకు చెందిన తొమ్మిదేళ్ల మేగన్ రాకేశ్ అమెరికన్ సింగర్ అలీసియా కీస్ పాటను పాడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఏకంగా నిజంగా ఆ పాట పాడిన అలీసియా కీస్ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. మేగన్ రాకేశ్ పాడిన పాట అలీసియా కీస్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం గమనార్హం.

బెంగళూరు: కర్ణాటకకు చెందిన తొమ్మిదేళ్ల మేగన్ రాకేశ్ సోషల్ మీడియాలో సంగీత ప్రియులను కట్టిపడేస్తున్నది. తన గాత్రంతో అహో అనిపిస్తున్నది. తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె ప్రతిభతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ముఖ్యంగా అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ అలీసియా కీస్ పాటలతో మైమరిపిస్తున్నది. మేగన్ రాకేశ్ పాట విని అలీసియా కీస్ స్వయంగా ప్రశంసించింది. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసుకుంది. అభిమాన గాయని తన పాటను షేర్ చేయడంపై మేగన్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నది.

మేగన్ రాకేశ్ చిన్నప్పటి నుంచే అంటే రెండేళ్ల నుంచే తండ్రితో మాటలో మాట, పాటలో పాట కలిపేది. చిన్నప్పటి నుంచే పాడటంపై అభిరుచి పెంచుకున్నది. ఏళ్లు గడిచినా కొద్దీ ఆమె పాడటంలో నైపుణ్యం పెంచుకున్నది. తండ్రి కూడా ఆమె గాత్రంపై మమకారం పెంచుకున్నాడు. కూతురు మేగన్ రాకేశ్ గొంతును పదిమందికి వినిపంచాలనే తపనతోనే ఆమెకు ఐదేళ్ల వయసుండగానే యూట్యూబ్‌లో చానెల్ క్రియేట్ చేశాడు.

మేగన్ రాకేశ్ ఎప్పడూ పాడుతున్నట్టుగానూ అలీసియా కీస్‌ పాడిన ‘ఫాలిన్’ పాటను పాడి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ పాట ఓ ఆన్‌లైన్ టాలెంట్ షోలో దుమ్మురేపింది. ఊహించని రీతిలో ఆ వీడియో వైరల్ అయింది. ఎంతగా చక్కర్లు కొట్టిందంటే, ఆ పాట స్వయంగా పాడిన అలీసియా కీస్‌కు చేరుకుంది. అలీసియా కీస్ ఆమె పాటను షేర్ చేసింది. ఈ విషయాన్ని మేగన్ రాకేశ్ తండ్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu