పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నాడనే అనుమానంతో..

By ramya neerukondaFirst Published 7, Sep 2018, 10:35 AM IST
Highlights

ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా కూడా .. అక్కడికి చేరుకొని అతనిని చెట్టుకు కట్టేశారు. అనంతరం విచక్షణా రహితంగా అతనిపై దాడి చేశారు.
 

పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నాడనే అనుమానంతో ఓ మతి స్థిమితం లేని వ్యక్తిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన 25ఏళ్ల యువకుడు మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడు. అతను బుధవారం సాయంత్రం సమయంలో పాటలమ్మ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే.. అతను తమ కుమారుడిని కిడ్నాప్ చేయడానికే వచ్చాడని వారు పొరపాటు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా కూడా .. అక్కడికి చేరుకొని అతనిని చెట్టుకు కట్టేశారు. అనంతరం విచక్షణా రహితంగా అతనిపై దాడి చేశారు.

ఇటీవల వాట్సాప్ లలో పిల్లలను కిడ్నాప్ చేసేవారు తిరుగుతున్నారంటూ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇతను కూడా అదే కేటగిరికి చెందిన వాడని భావించి స్థానికులు అతని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటన మొత్తాన్ని కొందరు ఔత్సాహికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వీడియో కాస్త పాపులర్ అయ్యింది.

విషయం పోలీసుల దాకా రావడంతో..వారు అక్కడికి వెళ్లి విచారించారు. అతను కిడ్నాపర్ కాదని.. మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతనిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

Last Updated 9, Sep 2018, 11:26 AM IST