ఇళ్లంతా దోచేసి...కుటుంబసభ్యులను బంధించి.. వారి ముందే మహిళపై గ్యాంగ్‌రేప్

Published : Sep 07, 2018, 08:20 AM ISTUpdated : Sep 09, 2018, 12:28 PM IST
ఇళ్లంతా దోచేసి...కుటుంబసభ్యులను బంధించి.. వారి ముందే మహిళపై గ్యాంగ్‌రేప్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంట్లో దోపిడికి వచ్చిన దుండగులు ఇళ్లంతా దోచేసి.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంట్లో దోపిడికి వచ్చిన దుండగులు ఇళ్లంతా దోచేసి.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘజియాబాద్‌ జిల్లాలోని కక్రా జిల్లాలో బుధవారం రాత్రి ఐదుగురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు.

కుటుంబసభ్యులను మారణాయుధాలతో బెదిరించి అందరిని తాళ్లతో కట్టేశారు. అనంతరం ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచేశారు. దొంగతనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. వారిలోని ఇద్దరి కన్ను ఓ మహిళపై పడింది.

కుటుంబసభ్యుల కళ్ల ముందే ఆమెపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి.. బాధితురాలిని వైద్య పరీక్షల  నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌