వీళ్లా అన్నదాతలు.. ? ‘ఢిల్లీ ఛలో’ కోసం బెంజ్ కార్లలో తరలివస్తున్న నకిలీ రైతులు..

By Sairam Indur  |  First Published Feb 13, 2024, 12:49 PM IST

పలు డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ (Delhi Chalo)కు పిలుపునిచ్చాయి. అయితే అసలైన రైతులు పొలాల్లో పని చేసుకుంటుంటే.. నకిలీ రైతులు ఖరీదైన కార్లలో దేశ రాజధానికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


2020 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో నెలల తరబడి నిరసన వ్యక్తం చేసిన రైతులు మరో సారి ఆందోళనకు సిద్ధమయ్యారు. 2021లో ఈ చట్టాలను రద్దు చేసినా.. ఇంకా కొన్ని డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదని చెబుతూ నిరసన చేపట్టాలని భావిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుండి 200 కు పైగా రైతు సంఘాల నాయకులు  కేంద్ర మంత్రులతో సోమవారం చర్చలు జరిపారు. అయితే అవి అసంపూర్తిగా మిగలడంతో నేడు ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చారు. 

These are "Poor" Farmers?? 🤷‍♀️😂 pic.twitter.com/O4mmweHTao

— Rosy (@rose_k01)

దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. వీరిలో చాలా మంది నకిలీ రైతులే ఉన్నట్టుగా అర్థమవుతోంది. అసలైన రైతులు పొలాల్లో కష్టపడుతుంటే.. వీళ్లు మాత్రం ఖరీదైన, లగ్జరీ కార్లలో ఢిల్లీకి చేరుకుంటున్నారని సోషల్ మీడియా యూజర్లు పేర్కొటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

The police will not attack them. Like last time.

But look at preparations. Are they poor farmers or they are preparing for violence ?

It means they don’t want negotiations. pic.twitter.com/0IlK7NWTg0

— Himanshu Jain (@HemanNamo)

Latest Videos

రైతుల డిమాండ్ లు ఆమోదయోగ్యంగా లేవని, వారిని కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ఓ యూజర్ పేర్కొన్నారు. ‘‘రైతులకు నెలకు రూ.10 వేలు పింఛన్. పంటల బీమాకు ప్రభుత్వమే చెల్లించాలి. డబ్ల్యూటీవో నుంచి భారత్ బయటకు రావాలి. గిరిజనుల హక్కులను పరిరక్షించాలని అంటున్నారు. అసలు పంజాబ్, హరియాణా గిరిజనుల జనాభా ఎంత’’ అని పేర్కొన్నారు. ఈ డిమాండ్ లను రైతులు తయారు చేశారా లేక కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందా అని ప్రశ్నించారు.

Apun ko bhi aisaich poor farmer hona maangta.
What is the procedure to become poor farmer like this to buy ₹4 crore car? pic.twitter.com/wQ7P7xAfhm

— 🙊🙈🙉 (@Timbaktooooo)

పంజాబ్ హరియాణాల్లో ఎస్టీలు ఎక్కువగా లేరని, ఈ నిరసన వెనక విదేశీ హస్తం ఉందని మరో యూజర్ ఆరోపించారు. ‘‘జాతీయ ఉపాధి హామీ పథకం కింద పొలాల్లో తవ్వడానికి రోజుకు రూ .700 - నెలకు రూ .21,000 జీతం డిమాండ్ చేయడం చాలా ఆసక్తికరమైన విషయం.’’ అని మరో యూజర్ పేర్కొన్నారు.

Apart from some Outrageous demands, what's most interesting is that these alleged farmers are demanding ₹700/day - ₹21,000/month salary for digging farms under MGNREGA. pic.twitter.com/ATP11YvlfC

— Mihir Jha (@MihirkJha)

‘‘ఈసారి అన్నదాతల చేష్టలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మినహా వారికి ప్రజల మద్దతు లేదు. గత నిరసనను కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సిక్కులుగా మార్చారు. పంజాబ్ లో నిప్పులు రాజేశారు. ’’ అని ఓ యజర్ పేర్కొన్నారు. 

Apun ko bhi aisaich poor farmer hona maangta.
What is the procedure to become poor farmer like this to buy ₹4 crore car? pic.twitter.com/wQ7P7xAfhm

— 🙊🙈🙉 (@Timbaktooooo)

‘‘ప్రభుత్వం రైతుల నుంచి ఎంఎస్పీపై ఖరీదైన ధరలకు పంటలను కొనుగోలు చేయాలి. అప్పుడు అదే పంటను ప్రజలకు చౌక ధరకు అందించాలి. ఈ రెండూ ఎలా సాధ్యమో ఏ ఆర్థికవేత్త అయినా చెప్పగలరా?’’ అని ఓ యూజర్ ప్రశ్నించారు. 

Waive off the loans??

Hahaha clowns, ultimately these Bloody agitators will increase NPA of banks.

10k/month pension is the most Clownful demand lol 🤣🤣🤣 https://t.co/jOezcXUzvM

— PREDATOR ࿗ 🇮🇳 (@Axel_Blazeee)

‘‘డబ్ల్యూటీవో నుంచి భారత్ వైదొలగాలని, తమకు నెలకు రూ.10,000 పింఛన్ ఇవ్వాలని ట్రాక్టర్ వాలాలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన కోరికలు అడగాలి. కానీ రాజధానిని స్వాధీనం చేసుకొని వాటి కోసం పోరాడుతున్నారు. వీరిపై ప్రభుత్వం కఠినంగా వ్యవరించాలి’’ అని ఓ యూజర్ డిమాండ్ చేశారు. 

Some goons think that they have done a favour on the society by becoming a goon. Initially, some people had sympathy but later many people realised that these goons only deserve Jail.https://t.co/SWpodxzaVL

— Shailendra Singh (@shaksingh)

‘‘కొందరు గూండాలుగా మారి సమాజానికి మేలు చేశారని భావిస్తున్నారు. వీరిపై మొదట్లో కొందరికి సానుభూతి ఉండేది కానీ ఆ తర్వాత ఈ గూండాలు జైలుకు వెళ్లేందుకు మాత్రమే అర్హులని చాలా మందికి అర్థమైంది.’’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. 

The real farmers do hard work in the farms.

The fake hired-protesters ride modified tractors with doubled horsepower.

There is no twist or sarcasm, neither it need long explanations. This is plain and simple fact.

— The Hawk Eye (@thehawkeyex)

కాగా.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పలువురు రైతులు ట్రాక్టర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొందరు ఖరీదైన ట్రాక్టర్లను తీసుకొని వస్తున్నారు. రైతులమని చెప్పుకుంటూ లగ్జరీ కార్లలో దేశ రాజధానికి పయనమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

click me!