ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ టెక్కీ స్కూటీపై వెళ్తూ ల్యాప్ టాప్ లో సమావేశానికి హాజరయ్యాడు.
బెంగుళూరు: స్కూటీపై ల్యాప్ టాప్ సహాయంతో మీటింగ్ కు హాజరైన టెక్కీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. రోడ్డుపై బండి నడుపుతూ ల్యాప్ టాప్ సహాయంతో సమావేశానికి హాజరు కావడంపై కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగుళూరు ప్రారంభకులకు కాదు అనే క్యాప్షన్ తో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఐటీ కంపెనీల్లో పని సంస్కృతి గురించి ఈ వీడియోను చూసిన కొందరు సెటైర్లు వేశారు. ప్రస్తుత పోటీ వాతావరణంలో ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఈ వీడియో నిదర్శనంగా మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. వారానికి 70 గంటల సమయం తక్కువగా ఉండొచ్చు... అతను ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
Bengaluru is not for beginners 😂
(🎥: ) pic.twitter.com/mgtchMDryW
జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉద్యోగులు ఎంత కాలం తమ సమయాన్ని వెచ్చిస్తారో ఈ వీడియో వెలుగులోకి తెచ్చింది.గతంలో సినిమాహలులో ల్యాప్ టాప్ తో పనిచేస్తున్న వ్యక్తి వీడియో కూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.