టీకాల దొంగతనం.. షాకైన డాక్టర్లు, ఆసుపత్రుల్లో అదనపు భద్రత

By Siva KodatiFirst Published Apr 14, 2021, 4:16 PM IST
Highlights

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో భారత్‌లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ , నైట్ కర్ఫ్యూ వంటి మార్గాల ద్వారా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో భారత్‌లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ , నైట్ కర్ఫ్యూ వంటి మార్గాల ద్వారా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అయితే కేసుల సంఖ్యలో మాత్రం మార్పు రావడం లేదు. వైరస్‌ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రధాని  నరేంద్రమోడీ టీకా ఉత్సవ్‌కు పిలుపునిచ్చారు.

కానీ దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వుందని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుసుకోవచ్చు. టీకా వేయించుకుందామని వెళ్లిన వారికి ఆసుపత్రుల్లో నో వ్యాక్సిన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే  పలు చోట్ల టీకాలు దొంగతనం జరుగుతున్నాయి. 

Also Read:కాలుతున్న శవాలకు, అధికారిక లెక్కలకు కుదరని పొంతన: మధ్యప్రదేశ్ సర్కార్‌పై ఆరోపణలు

తాజాగా జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కరోనా వ్యాక్సిన్లను కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దాదాపు 320 వ్యాక్సిన్లు దొంగలించబడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి సూపరిండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!